దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్లోని షేర్లు అన్నింటినీ కొనేసి, ఆ సంస్థను తన సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ట్విట్టర్కు ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ట్విట్టర్ తెలిపింది. "ట్విట్టర్లో ఇప్పటికే నాకు 9శాతానికి పైగా షేర్లు ఉన్నాయి. మిగిలిన షేర్లన్నీ నాకు అమ్మేయండి. ఒక్కో షేరుకు 54.2 డాలర్లు చెల్లిస్తా."... సామాజిక మాధ్యమం ట్విట్టర్కు దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చారు.
మొత్తం షేర్ల కోసం 41.39 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లిస్తానని ప్రతిపాదన చేస్తూ మస్క్ లేఖ పంపినట్లు స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది ట్విట్టర్. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే ఆ సంస్థ షేర్లు 12 శాతం ఎగబాకాయి. ట్విట్టర్లో ఇప్పటి వరకు 9.2 శాతం వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు మస్క్. ఆ తర్వాత ఆయన ట్విట్టర్ బోర్డులో సభ్యునిగా చేరతారని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా అందుకు నిరాకరించారు మస్క్. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
"బోర్డ్లో చేరడం లేదని మస్క్ నాకు చెప్పారు. ఇది కూడా మంచికే అనుకుంటున్నా. బోర్డ్లో సభ్యునిగా ఉన్నా లేకపోయినా భాగస్వామ్యపక్షాల సలహాలు, సూచనలు మేము స్వీకరిస్తాం. మస్క్ మన అతిపెద్ద వాటాదారు కాబట్టి ఆయన ఇన్పుట్స్కు ఎప్పుడూ విలువ ఉంటుంది. కొన్ని అవాంతరాలు ఎదురైనా.. మన లక్ష్యాలు, ప్రాథమ్యాలు మారవు. నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే అధికారం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి మన పనిపైనే దృష్టిపెడదాం" అని ట్విట్టర్ ఉద్యోగులకు జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు పరాగ్.
బోర్డ్లో చేరకూడదన్న మస్క్ నిర్ణయం.. వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. డైరెక్టర్గా చేరితే.. ఆ సంస్థలో 15శాతం కన్నా ఎక్కువ షేర్లు కొనరాదన్న నిబంధన ఉందని, అది నచ్చకే మస్క్ బోర్డ్కు దూరంగా ఉన్నారన్న విశ్లేషణలు వినిపించాయి. ట్విట్టర్లో మెజార్టీ వాటాను దక్కించుకుని, ఆ సంస్థపై పూర్తి ఆధిపత్యం సాధించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందన్న ఊహాగానాలు వినిపించాయి.