ఎమర్జెన్సీ అని ట్రీట్మెంట్ చేస్తే..కరోనా అని తెలిసి షాక్ అయిన డాక్టర్లు!

Update: 2020-04-07 14:00 GMT
యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువస్తే ...ఎమర్జెన్సీ అని ట్రీట్మెంట్ చేసిన పాపానికి ఇప్పుడు 40 మంది గల డాక్టర్ల బృందం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. యాక్సిడెంట్ కి ...డాక్టర్లు ఎందుకు క్వారంటైన్ లోకి ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా ? అక్కడే ఉంది అసలు సమస్య ! అసలు విషయం ఏమిటంటే... పూణెలోని కడ్నీ ఏరియాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ యాక్సిడెంట్‌ కు గురై ఆసుపత్రిలో చేరాడు. మార్చి 31న తీవ్ర గాయాలతో ఉన్న ఆ ఆటోడ్రైవర్‌ ను ఆసుపత్రిలో తీసుకొచ్చిన అతని కుటుంబ సభ్యులు...అతను ఎక్కడికి వెళ్లి రాలేదని, నగరంలోనే ఉంటున్నాడని డాక్టర్లకు అబద్ధం చెప్పారు.

దీనితో ఎమర్జెన్సీ కేసు కింద అతన్ని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు, చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అయితే తాజాగా ఐసీయూలో ఉన్న అతనికి జ్వరం రావడంతో డాక్టర్లకు అనుమానం వచ్చి, కరోనా టెస్ట్ చేయగా తడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీనితో అనుమానం వచ్చిన డాక్టర్లు .. కుటుంబసభ్యులను నిలదీయగా... అతను నిజాముద్దీన్ మర్కజ్‌‌లో జరిగిన తబ్లిగీ జమాజ్‌ కు వెళ్లివచ్చినట్టు చెప్పారు.

దీనితో డాక్టర్లకి నోట మాట రాలేదు. దీని వెంటనే ..అతనికి చికిత్స చేసిన 40 మంది వైద్యులు, నర్సులు, మరో 30 మంది సహాయక సిబ్బంది, పేషెంట్లను క్వారంటైన్‌కు తరలించారు. వేర్వేరు గదులల్లో ఉంచి, వీరి సాంపిల్స్‌ను కూడా కరోనా పరీక్షల కోసం పంపించారు. ఆటోడ్రైవర్ మర్కజ్‌ కు వెళ్లివచ్చిన విషయాన్ని దాచిపెట్టిన కుటుంబసభ్యులు, అతని ప్రాణాలను కాపాడిన వైద్యుల జీవితాలని ఇప్పుడు రిస్క్ లో పెట్టినట్టు అయ్యింది.



Tags:    

Similar News