అన్న వచ్చాడు, లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది వైసీపీ నేతలు ఎక్కడ చూసినా చేసుకునే ప్రచారం. జగన్ సైతం తన సభలలో అక్షరాలా లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగాలను ఇచ్చామని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పటికి దాదాపు మూడేళ్ళుగా సచివాలయాలలో కేవలం పదిహేను వేల రూపాయల జీతాలతోనే పనిచేస్తున్నారు.
ఇక చాకిరి చూస్తే బండెడు ఉంది. అన్ని శాఖల పనులూ సచివాలయాలకే వచ్చి పడతాయి. ఇక ఉదయం నుంచి రాత్రి వరకూ పని, అనేక రకాలైన పధకాలు అమలు కూడా వారితోనే ముడిపడిఉంది. అలాగే రాజకీయ వత్తిడులూ వారికే ఉంటాయి. ఒక విధంగా జగన్ మానసపుత్రికలుగా అవతరించిన సచివాలయాలు తరువాత కాలంలో సొంత పార్టీ వారికీ బయట వారికీ కన్నెర్రగా మారాయి.
అదే టైమ్ లో తమకు తక్కువ జీతం ఇస్తూ ఎక్కువ పనులు చేయిస్తున్నారని, రెండేళ్లలో ప్రొబేషన్ ఇస్తామని చెప్పి మూడేళ్ళు అయినా ఆ ఊసే లేదని కూడా వాపోయారు. ఒక దశలో ఆందోళనలు సచివాలయ ఉద్యోగులు చేపట్టారు. ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులకు పీయార్సీ ఇస్తే తమకు ప్రొబేషన్ ఇచ్చి పీయార్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొన్నాళ్ళు రోడ్డెక్కారు.
మొత్తానికి జగన్ అన్న మాకు అన్నీ చూసుకుంటాడు అని నమ్మిన వారే గొంతు మార్చి మమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అన్న స్టేజికి వెళ్లారు. ఇంత జరిగాక ఇపుడు ఎట్టకేలకు వారి మీద ప్రభుత్వానికి దయ కలిగింది. సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ వైసీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించిన ఫైల్ మీద జగన్ తాజాగా సంతకం పెట్టారు. అంటే దీనికి కొరకు తయారు చేసిన జీవో ఒకటి రెండు రోజులలో విడుదల కానుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్ ని ఖరారు చేయనున్నారు. ఇక జూలై ఒకటవ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్ అమలు కానుండగా ఆగస్ట్ 1కి కొత్త జీతం ఉద్యోగులు అందుకోనున్నారు.
మొత్తానికి సచివాలయ ఉద్యోగులకు ఇది శుభవార్త. ప్రభుత్వం కూడా ఇపుడు లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామని గట్టిగా చెప్పుకునే వీలు ఉంటుంది. ప్రోబేషన్ డిక్లరేషన్ అయింది కాబట్టి వారంతా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. అన్ని రకాలైన సర్కారీ రాయితీలు వారికి వర్తిస్తాయి.
మరి ఎన్నికలు ముందున్నాయని ఆలోచించారో లేక తాను స్థాపించిన సచివాలయ వ్యవస్థకు తానే న్యాయం చేయాలని అనుకున్నారో మొత్తానికి జగన్ ఇన్నాళ్ళకు కరుణించారు. రేపటి ఎన్నికల్లో కనుక ఈ ఉద్యోగులు ప్రభుత్వ పక్షం వహిస్తే వైసీపీకి రాజకీయంగా మేలు జరుగుతుంది. కనీసం ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు వేసుకున్న అయిదు లక్షల ఓట్లు సులువుగా వైసీపీ ఖాతాలోకి వెళ్తాయి. మరి చూడాలి ఇది రాజకీయ అస్త్రంగా ఎంతవరకూ ఉపయోగపడుతుందో.