ఓయో బుకింగ్స్ లోనే కాదు.. కండోమ్ ఆర్డర్స్ లోనూ హైదరాబాద్ టాప్!
ఈ క్రమంలో ఈ ఏడాది హైదరాబాద్ లో డెలివరీ చేసిన వస్తువుల వివరాలు వెల్లడిస్తూ స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో ఏకంగా 2.3 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయని.. అందులో హైదరాబాద్ వాటా పీక్స్ అని.. గత ఏడాదితో పోలిస్తే ఈ రూమ్ బుకింగ్స్ 37 శాతం పెరిగాయని 2024 జనవరిలో నివేదికలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది హైదరాబాద్ లో డెలివరీ చేసిన వస్తువుల వివరాలు వెల్లడిస్తూ స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అవును... ప్రస్తుతం మెట్రోపాలిటన్ సిటీల నుంచి గ్రామస్థాయి వరకూ ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగిందని అంటున్నారు. కురగాయల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్ ల వరకూ అన్నీ ఆన్ లైన్ లోనే ఆర్డర్ వేస్తున్నారు. పని ఒత్తిడి, ట్రాఫిక్ సమస్యలు మొదలైన కారణాలతో బయటకు వెళ్లలేని వారికి ఆన్ లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్ గా మారిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో హైదరబాద్ లో స్విగ్గీ రికార్డ్ స్థాయిలో డెలివరీలు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... హైదరాబాద్ లో ఈ ఏడాది డెలివరీ చేసిన వస్తువుల వివరాలు వెల్లడిస్తూ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా.. పలు వస్తువులు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఆర్డర్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
వీటిలో వెజిటబుల్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్, మ్యాగీ, పాల ప్యాకెట్లతో పాటు కండోమ్స్ ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా... 2024లో గరిష్టంగా సుమారు 2 కోట్ల చిప్స్ ప్యాకెట్ల ఆర్డర్లు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో... 19 లక్షలకు పైగా పాల ప్యాకెట్లకు సంబంధించిన ఆర్డర్స్ వచ్చినట్లు వెల్లడించింది.
అదే విధంగా.. బ్రెడ్స్, ఎగ్స్ కోసం సుమారు రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్స్ స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. లోదుస్తుల కోసం 18,000 ఆర్డలు వచ్చినట్లు తెలిపింది. ఇదే సమయంలో.. సుమారు కండోమ్స్ కోసం సుమారు 2 లక్షల ఆర్డర్లను స్వీగ్గీ తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తూ అన్నట్లు మ్యాగీ ప్యాకెట్లకు సంబంధించిన ఆర్డర్లు 25 లక్షలు వచ్చినట్లు తెలిపారు.
ఇక టూత్ బ్రష్ లు, ఐస్ క్రీమ్ లు, బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలోనూ హైదరాబాదీలు భారీ సంఖ్యలో ఆర్డర్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... రూ.2.3 కోట్లకు పైగా టూత్ బ్రష్ ల కోసం ఖర్చు చేయగా.. హైదరాబాదీలు ఐస్ క్రీమ్ ల కే సుమారు రూ.31 కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు.
ఇక ప్రధానంగా... రూ.15 కోట్ల విలువ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసినట్లు కంపెనీ పేర్కొనగా.. హైదరాబాదీలు ఆర్డర్ చేసిన కూరగాయల్లో టమోటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నట్లు తెలిపింది.