500 ఎయిర్ ఇండియా విమానాల ఆర్డరులో చిక్కుముడులు!

Update: 2023-01-20 09:45 GMT
పౌర విమానయాన చరిత్రలోనే టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ ఎయిర్ బస్.. బోయింగ్ లతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దాదాపు 500 విమానాల కోసం ఎయిర్ ఇండియా అత్యంత భారీ మొత్తంలో సదరు సంస్థలతో ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెల్సిందే. అయితే ఈ డీల్ కు తాజాగా తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

ఈమేరకు బోయింగ్ 737 మాక్స్ విమానాలకు ఇంజిన్ల సరఫరాలో జనరల్ ఎలక్ట్రిక్ కు చెందిన సీఎఫ్ఎం ఇంటర్నేషనల్.. సాఫ్రన్ ఎస్ఏ సంస్థలతో కూడిన జాయింట్ వెంచర్లతో జరుపుతున్న చర్చల్లో అవాంతరాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. విమానాల మరమ్మతుల కోసం ఎయిర్ ఇండియా గంటల లెక్కన చెల్లించే పరిహారం విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొందని సమాచారం.

ప్రస్తుతం ఎయిర్ బోయింగ్.. ఎయిర్ బస్ లలో వినియోగిస్తున్న టర్బో ఫ్యాన్ ఇంజిన్ల అంచనాల కంటే ముందుగానే మరమ్మతులు చేయాల్సి ఉంటుందని తయారీ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చెల్లింపుల విషయంలో ఇంజిన్ తయారీ సంస్థలు రాయితీ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

నిజానికి గత ఏడాది చివరి నాటికే ఎయిర్ ఇండియా 100 బిలియన్ డాలర్ల (సుమారు 8.2 లక్షల కోట్లు) ఒప్పందాన్ని చేసుకోవాలని భావించింది. ఇదే విషయంపై గత కొన్ని నెలలుగా ఇరువర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇంజిన్ సరఫరా విషయంలో ఏర్పడిన సమస్య కారణంగా చెల్లింపుల ప్రక్రియ ఆలస్యమవుతోందని సమాచారం.

ఈ భారీ ఆర్డరులో 400 నేరో బాడీ విమానాలు.. వంద లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి. డజన్ల కొద్ది ఎయిర్ బస్ ఏ350.. 321 నియో బోయింగ్ 787.. 777.. 777 ఎక్స్.. 737 మ్యాక్స్ శ్రేణి విమానాల కొనుగోలు కోసం ఎయిర్ ఆర్డర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సంఖ్యాపరంగా ఒక విమానయాన సంస్థకు ఇవ్వనున్న అతిపెద్ద డీల్ ఇదే కానుంది. దశాబ్దం క్రితం అమెరికన్ ఎయిర్ లైన్స్ 460 ఎయిర్ బస్.. బోయింగ్ విమానాలకు వచ్చిన ఆర్డర్ ఇప్పటి వరకు పెద్దదిగా నిలిచినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News