సెక్స్ ట్రాప్ లో నేతలు - వ్యాపారులు - అధికారులు

Update: 2019-09-21 07:37 GMT
మధ్యప్రదేశ్ లో భర్తతో విడాకులు తీసుకొని ఎన్జీవో సంస్థ నడుపుతున్న మహిళ వ్యభిచార దందా గుట్టురట్టయ్యింది.. ఆమె నిర్వహిస్తున్న భారీ సెక్స్ రాకెట్ ను పోలీసులు ఛేధించారు. ముఖ్యంగా బడా వ్యాపారులు - అధికారులు - ప్రజాప్రతినిధులు - ధనవంతులే టార్గెట్ గా మధ్యప్రదేశ్ లోని 12 జిల్లాల్లో ఈ మహిళ నిర్వహించిన సెక్స్ రాకెట్ సంచలనంగా మారింది.

అరతి దయాల్ అనే మహిళ నిర్వహిస్తున్న భారీ సెక్స్ రాకెట్ ను ఓ ఇంజనీర్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఎన్టీవో సంస్థ పేరుతో గా బడా వ్యాపారులు - అధికారులు - ప్రజాప్రతినిధులు - ధనవంతులతో పరిచయం పెంచుకోవడం.. వారికి 18 ఏళ్ల యువతులను ఎరగా వేయడాన్ని అరతి దయాల్ అలవాటుగా మార్చుకుంది... అనంతరం వారితో గడిపిన సెక్స్ బాగోతాన్ని వీడియో తీసి బెదిరించడం ఈ మహిళ పని.. ఇటీవల ఓ మధ్యప్రదేశ్ మాజీ ఎంపీని కూడా బుక్ చేసి బ్లాక్ మెయిల్ చేయగా అతడు ఆత్మహత్యయత్నం చేయడం కలకలం రేపింది.

తాజాగా ఓ హర్భజన్ సింగ్ అనే ఇంజినీర్ ను కూడా ఈ ట్రాప్ లో బుక్ చేసింది. 18 ఏళ్ల యువతికి ఉద్యోగం కావాలని ఇంజినీర్ హర్భజన్ సింగ్ వద్దకు పంపింది. అతడికి ఎరవేసి ఓ హోటల్ లో యువతితో ఎంజాయ్ చేసేలా చేసింది. ఆ దృశ్యాలను వీడియో తీసి ఏకంగా 3 కోట్లు బ్లాక్ మెయిల్ చేసింది.

మహిళ మోసాన్ని గ్రహించిన హర్భజన్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనల మేరకు ఆమెతో 50 లక్షల ఒప్పందం చేసుకొని చెల్లిస్తానని రమ్మన్నాడు. అరతి దయాల్ తో పాటు మరో ముగ్గురు రాగా పోలీసులు మాటు వేసి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. విచారణలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. మొత్తం 12 జిల్లాల్లో అరతి దయాల్ ఈ సెక్స్ రాకెట్ నడిపిందని.. ఈమె ట్రాప్ లో పడి చాలా మంది లక్షలు ముట్టజెప్పారని.. ఓ మాజీ ఎంపీ సూసైడ్ అంటెప్ట్ కూడా చేశాడని విచారణలో నిగ్గుతేలినట్టు సమాచారం.
   

Tags:    

Similar News