పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్ కళాశాలలు ఎంతగా బరితెగించాయో తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగేది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం పుణ్యమా అని ప్రభుత్వ నిధుల్ని చేజిక్కించుకునేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఇంజినీరింగ్ కాలేజీల అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది.
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడిన తర్వాత ఇంజినీరింగ్ కళాశాలల ప్రమాణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి నిలపటం.. తన మంత్రి వర్గంలోని మంత్రికి చెందిన ఇంజినీరింగ్ కళాశాలను సైతం మూసివేయాలని కోరటం తెలిసిందే.
నిబంధనల్ని పాటించని ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే తాజాగా ఇంజినీరింగ్ కళాశాలలు దారికి వస్తున్నాయి. ఫ్యాకల్టీ లేకున్నా ఉన్నట్లు చూపించేయటం.. ఫ్యాకల్టీ విషయంలో మేనేజ్ చేయటం ద్వారా ఇంతకాలం బండి లాగించిన ఇంజినీరింగ్ కాలేజీలు ఇప్పుడు దారికి వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని 213 కాలేజీలు తమకు చెందిన 42వేల సీట్లను రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకోవటమే కాదు.. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాయి. విశేషం ఏమిటంటే.. ఈ 213 కాలేజీల్లో 13 కాలేజీలు అయితే.. తాము కళాశాలలు పూర్తి మూసేయనున్నట్లు వెల్లడించాయి. నియమనిబంధనల విషయంలో పక్కాగా వ్యవహరించటం.. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమన్న ప్రభుత్వ సంకేతంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని చెబుతున్నారు.
రూల్స్ పాటించని.. ప్రమాణాలు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న 163 కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్‌టీయూ నిరాకరించటం తెలిసిందే. దీనిపై ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు సుప్రీంను ఆశ్రయించటం తెలిసిందే. పరిమితులతో వారికి గుర్తింపు ఇవ్వాలని సుప్రీం పేర్కొంది. మరసారి కళాశాలలు తమ గుర్తింపును రెన్యువల్‌చేసుకోవాల్సిన నేపథ్యంలో.. కఠినవైఖరితో వ్యవహరిస్తున్న ప్రభుత్వంతో ఢీ కొనే కన్నా.. వెనక్కి తగ్గటం మంచిదన్న ఉద్దేశ్యంతో కాలేజీలు తమకు తాముగా దారికి వచ్చినట్లు చెబుతున్నారు. 42వేల సీట్లు తాజాగా కాలేజీలే రద్దు చేసుకోవటంతో... తెలంగాణ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలు పెరుగుతాయని భావిస్తున్నారు. కాలేజీలు తమకు తాముగా ఇంత భారీగా సీట్లు రద్దు చేసుకోవటం కచ్ఛితంగా తెలంగాణ ప్రభుత్వ కఠిన వైఖరితోనే సాధ్యమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.