ఇంజనీరింగ్ విద్య, విద్యార్థులతో ఇటు ప్రభుత్వాలు అటు కోర్టులు ఆటలాడుకుంటున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టు మరొక నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీం కోర్టు ఇంకొక నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఏడాదిలో ఒకసారి తీసుకుని.. ఆ తర్వాత అన్ని సంవత్సరాలూ ఇదే అమలు జరుగుతుందని అనుకుంటే పొరపాటే. ఏడాదికోసారి ప్రభుత్వాలూ కోర్టుల నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అంతిమంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, వాటి తల్లిదండ్రులు దీనితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
సరైన ప్రమాణాలు లేని కాలేజీల్లో కౌన్సెలింగ్ ను నిరాకరిస్తూ ప్రభుత్వం మరీ ముఖ్యంగా జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. ఏఐసీటీఈ, సుప్రీం కోర్టు నియమించిన కమిటీ తనిఖీలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమాణాలు లేని కాలేజీల్లో చదివిన వందలాదిమంది విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇప్పుడు రోడ్డు మీద జులాయిలుగా తిరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవడాన్ని సమర్థించవచ్చు. దీనికితోడు ప్రమాణాలు లేని కాలేజీల్లో ప్రవేశాలను నిరాకరిస్తే అందులో ఎవరైనా తప్పు పట్టడానికి ఏముంటుంది? ప్రమాణాలు ఉన్నాయని నిరూపించుకోవాల్సిన బాధ్యత సదరు కాలేజీదే కదా. సాంకేతిక కమిటీ వచ్చినప్పుడు ప్రమాణాలు ఉండి కూడా లేవని తీర్మానిస్తే ఆ కమిటీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా ప్రమాణాలు లేకుండా.. అయినా తమకు ప్రవేశాలకు అర్హత కల్పంచాలని ఆయా కాలేజీలు కోరుతుంటే వాటిలో పూర్తిగా ప్రవేశాలను నిషేధించవచ్చు కదా. కానీ, ప్రమాణాలు లేని కాలేజీలు ప్రతి ఏటా ముందుగా హైకోర్టుకు అక్కడి నుంచి సుప్రీం కోర్టుకూ వెళుతున్నాయి. అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నాయి. తప్పితే ప్రమాణాలు పెంచుకోవడానికి ప్రయత్నించడం లేదని నిపుణులే విమర్శలు చేస్తున్నారు.
ప్రతి ఏటా ఇదొక పెద్ద ప్రహసనంగా మారుతోంది. ఆగస్టు ఒకటో తేదీకి ప్రవేశాలు మొదలు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించినా అది అమలు కావడం లేదు. ప్రవేశాలకు, ప్రమాణాలకు సంబంధించి శాశ్వతంగా నిర్దిష్ట విధానాలను ప్రవేశపెట్టేలా ఇప్పటికైనా కోర్టులు, ప్రభుత్వాలూ నిర్దిష్ట నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఉత్పన్నం అవుతుంటే విద్యా వ్యవస్థ మీదే విద్యార్థులు విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.