ప్రపంచకప్: ఆతిథ్య దేశానికి ఝలక్!

Update: 2019-06-26 04:57 GMT
ఈ ప్రపంచకప్ కు హాట్ ఫేవరెట్ ఇంగ్లండే అని అనేక మంది చెబుతూ వచ్చారు. వన్డేల్లో ఇంగ్లండ్ బీభత్సమైన ఫామ్ లో ఉండటం - స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతూ ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశాలు అని క్రికెట్ విశ్లేషకులు చెబుతూ వచ్చారు. స్వదేశంలోని కండీషన్స్ ను ఉపయోగించుకుని ఇంగ్లండ్ దుమ్మురేపుతుందని వారు అంచనా వేశారు.

అయితే.. ఆ జట్టు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం గమనార్హం. ఇప్పటికి అయితే ఇంగ్లండ్ మంచి పొజిషన్ లోనే ఉంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తద్వారా సెమిస్ రేసులో ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి ఇంగ్లండ్ కు ఇబ్బందికరమైన అంశంగా మారింది.

ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడిన బ్రిటిష్ జట్టు నాలుగు మ్యాచ్ లలో నెగ్గింది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వాటిల్లో నెగ్గితే సెమిస్ రేసులో నిలుస్తుంది. రెండింటిలో ఓడినా - ఒక మ్యాచ్ లో మాత్రమే నెగ్గినా ఇంగ్లండ్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి.

పాకిస్తాన్ - శ్రీలంకలకు ఇంకా  ఛాన్సులున్నాయి. ఆ జట్లకు ఇంకా మూడు - మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వాటిల్లో అవి వరస విజయాలు సాధిస్తే.. సెమిస్ రేసులో ఇంగ్లండ్ కు అవి పోటీగా మారే అవకాశం ఉంది.
Tags:    

Similar News