కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి - రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లపై ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. `రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఒక ఐటమ్ సాంగ్ డ్యాన్సర్.. ఒక బ్రోకర్` అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని తానే జైళ్లో పెట్టించానని చెప్పిన వ్యక్తి.. జైలు నుంచి వచ్చాక తన ఇంటికి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆరోజే ఎందుకు ఈ విషయం చెప్పలేదని రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. `నేను నీలాగా పూటకో పార్టీ మారలేదు.. పార్టీని టీఆర్ ఎస్ లో విలీనం చేశాను. నన్ను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు`ని దయాకర్ రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞం.. ధన యజ్ఞంగా మారిందని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయో కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మద్దతు ధర ఇవ్వాల్సింది కేంద్రం అని.. కానీ, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని దయాకర్ రావు విమర్శించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మీ పాలనలో ఎందుకు గుర్తించలేదని, దళితుల గురించే మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని అన్నారు. పాలకుర్తికి వెళ్లడానికి కాంగ్రెస్ హయంలో మోకాలు లోతు గుంతలు ఉండేవని.. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో కనిపించడంలేదా? అని అన్నారు.
కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ఒక రౌడీ షీటర్ అని ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. `నయిం తర్వాత ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తి జంగా రాఘవ రెడ్డి . రాఘవరెడ్డిపై బుక్ లెట్ విడుదల చేస్తా` అని ప్రకటించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాఘవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే నామినేషన్ వేయకుండా ఎందుకు ఉన్నాడని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన వ్యక్తి జంగా రాఘవ రెడ్డి అని ఆరోపించారు. తన మీద ప్రజల కోసం ఉన్న కేసులు ఉన్నాయే తప్ప వ్యక్తిగతంగా కేసులు లేవని ఆయన తెలిపారు.