ఎవరితోనైనా గేమ్ ఆడు.. నాతో కాదంటూ తెలుగు సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగులకు తగ్గట్లే తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అందరికి అర్థమవుతున్న సత్యమేమిటంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో అనవసరంగా గేమ్ లొద్దని. పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సరే నోరు జారితే.. కేసీఆర్ దగ్గర చిట్టాలో రిజిష్టర్ అవుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ ను అడ్డదిడ్డంగా తిట్టేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు.. తానుపార్టీ మారానని.. నాడు ఓ రేంజ్ లో తిట్టేసిన కేసీఆర్ కు తానిప్పుడు పెద్ద బంటు అన్న విషయాన్ని మరిచిపోకూడదు. అధినాయకుడిని నిత్యం కీర్తించాలే కానీ.. ఎప్పుడూ పోల్చి గొప్పలు చెప్పుకోకూడదు. బాబు లాంటి నేతతో ఒక మాట అటూ ఇటూ అయినా వచ్చే ప్రాబ్లం తక్కువ. కానీ.. కేసీఆర్ తో అలా ఉండదు.
అయితే.. ఇలాంటివేమీ ఎర్రబెల్లికి పెద్దగా అర్థమైనట్లు లేదు. బాబును హ్యాండిల్ చేసినట్లే కేసీఆర్ ను హ్యాండిల్ చేస్తే కరెంటు షాక్ తగులుతుందన్న విషయం ఎర్రబెల్లికి అర్థమయ్యేలా చెప్పేదెవరు? తన పట్ల అపరిమితమైన విధేయతను మాత్రమే ఒప్పుకునే కేసీఆర్ లాంటి నేతను.. ఆయనతో సమానంగా తనను తాను పొగుడుకోవటం లాంటి ఖరీదైన తప్పులు చేయకూడదన్న విషయం ‘తమ్ముడు’ ఎర్రబెల్లికి ఎప్పటికి అర్థమయ్యేను?
తాజాగా మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. కేసీఆర్ తర్వాత.. వరుసగా ప్రతి ఎన్నికల్లో గెలిచిన ఘనత తనదేనని చెప్పుకోవటం తెలిసిందే. ఈ తరహా గొప్పలు కేసీఆర్ కు ఎక్కడో కాలేలా చేస్తాయని.. ఇలాంటి మాటలు తన లాంటి శిష్యగణం నోటి నుంచి అస్సలు రాకూడదన్న విషయం ఎర్రబెల్లి లాంటి సీనియర్ నేతకు ఎందుకు అర్థం కావటం లేదు? వస్తే.. గిస్తే కేసీఆర్ నోటి నుంచి మాత్రమే రావాలి. కొన్నిసార్లు కేసీఆర్ నోటి నుంచి పొగడ్తలు వచ్చాయంటే.. వారికి పదవులు రానట్లే. ఇన్నిలెక్కలుండే కేసీఆర్ అధినేత దగ్గర వీలైనంత వరకూ కామ్ గా ఉండాలే కానీ.. ఇలా మాట్లాడకూడదన్న విషయం ఎర్రబెల్లికి అర్థం కాకపోవటం ఏమిటి?
టీఆర్ఎస్ లోకి రావటంతో.. ఆయన కేసీఆర్ కున్న భారీ శిష్యగణంలో ఒకరయ్యారన్న విషయాన్ని ఎర్రబెల్లి మర్చిపోకూడదు. నిన్న మొన్నటి వరకూ ఒక పార్టీకి శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి ఈ రోజు ఒక ఎమ్మెల్యే మాత్రమే. తలసాని శ్రీనివాస్ లాంటి వ్యక్తి కారు ఎక్కటంతోనే మంత్రి పదవి పొందితే.. ఎర్రబెల్లి మాత్రం.. అలాంటి రోజు కోసం చకోరపక్షిలా ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇదొక్కటి చాలు.. తన స్థానం ఏమిటో ఎర్రబెల్లికి అర్థం కావటానికి. కానీ.. వాస్తవాన్ని మర్చిపోయి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నఎర్రబెల్లి.. అధినాయకుడు కేసీఆర్ తో తనను పోల్చుకోవటం.. గొప్పలు చెప్పుకోవటం లాంటివి చేస్తే దెబ్బ పక్కా అన్న విషయాన్ని మర్చిపోకూడదు.