నచ్చినంతకాలం బెల్లం.. నచ్చనంతనే అల్లం అంటే ఇదేనేమో? టీటీడీపీ నుంచి జంప్ అయి టీఆర్ఎస్ లోకి చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. కారులోకి ఎక్కిన తమ వైనాన్ని పోల్చిన తీరు చూస్తే ముచ్చటేయాల్సిందే. తాము పార్టీ ఫిరాయింపు చేయలేదని.. పార్టీని విలీనం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. తనలానే.. తన తోటోళ్లు చేసిన దాన్ని సమర్థించని ఆయన.. తనను తాను సమర్థించుకోవటం విశేషం.
గతంలో తాను టీఆర్ఎస్ లో చేరితే వ్యతిరేకత వచ్చేదని.. ఇప్పుడు చేరటం అనివార్యమైందని.. అందరూ సమర్థిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అప్పుడెప్పుడో జరిగిన జమానా సంగతిని యాద్ చేసుకున్నారు. తాను ఎన్టీఆర్ వీరాభిమానినని.. ఆయన్ను పక్కకు తప్పించేందుకు చంద్రబాబు అప్పట్లో చేసినట్లే తాము ఇప్పుడు చేశామని చెప్పుకున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ ను కాదన్న ఎమ్మెల్యేలను స్పీకర్ గుర్తించినట్లే.. తమనూ సభాపతి గుర్తించినట్లు చెప్పిన ఎర్రబెల్లి.. విలీనం గురించి స్పీకర్ నే అడగాలని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వెంటనే వెరైటీ మాటలు చెబుతున్న ఎర్రబెల్లి మాటలు వింటే కొన్ని సందేహాలు ఇట్టే పుట్టుకు రావటం ఖాయం.
ఎన్టీఆర్ ఉదంతాన్ని చెప్పుకొచ్చిన ఎర్రబెల్లి.. నాడు ప్రక్రియ మొత్తం ఒక్కసారిగా జరిగిపోయి.. సీఎంగా చంద్రబాబు అయ్యారు. మరి.. తాజా ప్రక్రియ ఏళ్లకు ఏళ్లుగా గడిచింది. చివరకు సీఎం కాదు కదా.. ఎర్రబెల్లికి మంత్రి పదవి కూడా దక్కలేదు. అలాంటప్పుడు నాటి ఘటనను ఇప్పుడు జరిగిన దాంతో ఎలా పోలుస్తారు? అంతదాకా ఎందుకు.. అప్పట్లో జంప్ అయిన తలసాని అండ్ కోల మీద స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎర్రబెల్లికి.. అప్పట్లో ఎన్టీఆర్ ఉదంతం ఎందుకు గుర్తుకు రానట్లు? గతంలో పార్టీ నుంచి జంప్ అయి ఉంటే వ్యతిరేకత వచ్చేదని.. ఇప్పుడు అనివార్యమని చెబుతున్నఎర్రబెల్లి.. తన మాటలతోనే.. ఎన్టీఆర్ ఇష్యూను.. తాజా ఘటనను పోల్చటం సరికాదన్న విషయం అర్థమవుతుంది.
తాజా పోలికను చూస్తే.. నాడు ఎన్టీఆర్ ను దెబ్బేసిన చంద్రబాబు తమ్ముళ్లకు లీడర్ అయ్యారు. మరి.. ఎర్రబెల్లి విలీనమైన తమ్ముళ్లకు నాయకుడినని చెప్పుకున్నట్లా? లాంటి ప్రశ్నలు చూసినప్పుడు.. తాను ఫిరాయింపులకు పాల్పడలేదన్న విషయాన్ని సమర్థించుకోవటంలో ఎర్రబెల్లి అడ్డంగా దొరికిపోయాడని చెప్పొచ్చు. పోలిక చెప్పటంలో కుదరని ఆయన.. ఈ ఇష్యూ మీద నోరు విప్పి బుక్ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుకుంటాం కానీ.. తాను ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పుకుంటున్న ఎర్రబెల్లి.. తాను అంతగా అభిమానించిన ఎన్టీవోడికే దెబ్బేసిన ఆయనకు బాబు ఓ లెక్కా?