ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలని భావిస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయ్యాయి. రాజధాని శంకుస్థాపనకే చంద్రబాబు ఎక్కడాలేని ప్రత్యేకతను చాటుకున్నారు. దేశంలోని వివిధ నదుల నుంచి నీళ్లను - మట్టిని సేకరించారు. అత్యంత ఆర్భాటంగా ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఆహ్వానించి అమరావతి శంకుస్థాపన చేశారు. ఇక, రాజధానిలో మొత్తం 9 నగరాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ నైన్ సిటీలనూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల రాజధానులతో సమానంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో సింగపూర్ సహా అనేక దేశాల రాజధానులను ప్రత్యక్షంగా పరిశీలించి వచ్చారు. అదేవిధంగా ఆయా నగరాల నమూనాలకు ప్రత్యేకంగా డిజైన్లను కూడా ఆహ్వానించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్డీఏ) మాత్రం.. అమరావతిలో భవన నిర్మాణాలు సహా.. మౌలిక వసతులకు భారీ ఎత్తున అంచనాలు సిద్ధం చేసింది. భవన నిర్మాణాలను మరో వెయ్యేళ్ల ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామని - మౌలిక సదుపాయాలూ అంతేనని పేర్కొన్న సీఆర్ డీఏ వాటికి అయ్యే ఖర్చుపై నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీని ప్రకారం అమరావతిలో భవనాల నిర్మాణానికి - మౌలిక వసతులకు కలిపి సుమారు 75వేల కోట్ల రూపాయల వ్యయం కానుంది. వీటిలో 10,500 కోట్లు భవనాల నిర్మాణానికి అవసరం అవుతాయని సీఆర్ డీఏ తేల్చి చెప్పింది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.64,958 కోట్లు అవసరమని స్పష్టం చేసింది.
అయితే, ఇంత మొత్తం ఇప్పటికిప్పుడే కాకుండా ఇదంతా 2050 నాటికి అవసరం అవుతుందని పేర్కొనడం గమనార్హం. వచ్చే పదేళ్లకు 16 వేల కోట్ల రూపాయలు కావాలని లెక్కగట్టింది. అయితే, రాజధాని నిర్మాణం - మౌలిక వసతుల బాధ్యత సీఆర్ డీఏపైనే ఉండడంతో ఈ నిధులను సమకూర్చుకోవడం సీఆర్ డీఏ పైనే ఉంది. దీంతో ఈ సంస్థ.. ప్రపంచబ్యాంక్ - ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) - హడ్కో నుంచి రూ.12,825 కోట్లను అప్పుగా తీసుకుంటున్నామని, మిగతా రూ.3,354 కోట్లను రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇవ్వాలని ఆర్థికశాఖను కోరింది. ఈ క్రమంలో అప్పలు - లెక్కలతో ఓ నివేదికను అందజేసింది. మరి ఆర్థిక శాఖ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా చంద్రబాబు ఫ్యూచర్ వ్యూహం.. భారీస్థాయిలోనే ఖర్చు పెట్టిస్తోంది!