మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అధికార పార్టీపైనా.. సీఎం కేసీఆర్‌పైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇటీవల.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తిరిగి తన సత్తా చాటుకున్న తర్వాత.. ఈ రేంజ్‌లో కేసీఆర్‌పై ఆయన విరుచుకుపడడం ఇదే తొలిసారి అంటున్నారు పరిశీలకులు. తనను పార్టీని నుంచి బయటకు సాగనంపిన తర్వాత నుంచి.. కేసీఆర్‌పై ఆగ్రహంతో ఉన్న ఈటల.. ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు విరుచుకుపడుతున్నారు. తాజాగా సిద్ధిపేటలో జరిగిన ఘటనపై మరింత ఫైరయ్యారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని గ్రహించుకోవాలన్నారు. ``ఇక నీ కాలం చెల్లదు గుర్తుంచుకో`` అంటూ సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి స్థాయి పరిహారం అందించే వరకు రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.
18 సంవత్సరాలు నిండిన యువకులకు 8 లక్షల పరిహారం చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు ఈటల రాజేందర్. లక్షలాది మందికి అవకాశం కల్పించే గూడటిపల్లి ప్రజలు న్యాయమైన డిమాండ్ల కోసం డిమాండ్ చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేస్తూ రక్తపాతం సృష్టించడం దుర్మార్గం మైన చర్య అని ఆగ్రహించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం.. కార్మికులపై లాఠీలు విరగడం.. నిత్యకృత్యంగా మారిందని ఈటల దుయ్యబట్టారు. మొత్తానికి ఈ టల వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.