అందుకే ఆలా చేయాల్సి వచ్చింది..పేషేంట్ అంత్యక్రియలపై స్పందించిన మంత్రి!

Update: 2020-05-21 11:50 GMT
గాంధీ ఆస్పత్రి లో వైరస్ పాజిటివ్ కారణంగా చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను నిర్వహించడంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.  మొదట్లో వైరస్ తో చనిపోయిన వారిని  దహనం చేయడానికి భయపడ్డారని ఆయన అన్నారు. ఈశ్వరయ్య ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో చనిపోయారని ఆయన కుమారుడు అదే రోజు ఆస్పత్రికి వచ్చి 1 వ తేదీన చనిపోయాడని ఆయన అన్నారు.

మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పామని, ఆయన భార్యకు తెలిస్తే షాక్‌ లోకి వెళ్లే ప్రమాదముందని చెప్పలేదని తెలిపారు. అప్పుడు డెడ్‌ బాడీని ఫ్రీజర్‌ లో పెట్టే పరిస్థితి లేదని అందుకే ఆలా చేయాల్సి వచ్చింది అని, మధుసూదన్ మరణవార్త తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులే చెప్పారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆ సమయంలో కుటుంబమంతా ఆస్పత్రిలోనే ఉండటంతో... ప్రభుత్వం తరపున అంత్యక్రియలు మేమే చేశామని అన్నారు. వారి ఆరోగ్యం కుదుటపడ్డ తరువాత ఇలా మాట్లాడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News