రాజకీయాల్లో ఆత్మ హత్యలే ఉంటాయి: ఈటల

Update: 2020-01-08 04:16 GMT
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి బరస్ట్ అయ్యారు. తన ఆవేదనను వెళ్లగక్కారు. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాల్లో తనపై కుట్ర జరుగుతున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

గులాబీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈటల రాజేందర్.. కేసీఆర్ తోపాటు ఉద్యమం లో ఉన్నారు. అదే ఉద్యమం లో బీసీ నేతగా ఎదిగారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా అత్యున్నత హోదాను అనుభవించారు. అయితే క్రమంగా ఈటల రాజేందర్ ప్రభ తగ్గుతూ వస్తోంది. కేసీఆర్ మొదటి కేబినెట్ ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన ఈటలకు అసలు రెండో దఫా మంత్రి పదవే దక్కదని అనుకున్నారు. ఆయనను మంత్రి వర్గంలోంచి తొలగిస్తారని భావించారు. చివరి నిమిషంలో మంత్రి పదవి ఇచ్చారట..

మొదటి నుంచి పార్టీలో ఉన్నప్పటికీ కొన్ని రాజకీయ శక్తులు తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఈటల మథనపడుతున్నట్టు తెలిసింది. వారి మార్గంలో వెళ్లలేని ఈటలను పక్కకు తప్పించాలని కుట్ర జరిగిందని ఆయన భావిస్తున్నాడు.

అయితే ఈటల రాజేందర్ అంత తేలికగా తన అధికారాన్ని వదలుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ఈ శక్తులను ఎదురించడానికి ప్రయత్నిస్తున్నాడు. తొందర పడి పార్టీ మారే నిర్ణయాలు తీసుకొని తనను తాను డిఫెన్స్ లో పడేయకుండా పార్టీనే దోషిని చేయాలని చూస్తున్నాడు. ఇతరుల మాదిరిగా పశ్చాత్తాపడకుండా చివరి వరకూ పోరాటానికి సిద్ధమయ్యాడు.

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మరోసారి పార్టీలో గుబులు రేపాయి. ఎన్నికల కోసమే సీటు రాలేదని.. అధికార పార్టీ అని తొందరపడి పార్టీలు మారే నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదు’ అని ఈటల కుండబద్దలు కొట్టారు. అయితే ఈటల వ్యాఖ్యల వెనుక వేరే అర్థం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి నుంచి పార్టీ లో ఉన్న తమ లాంటి వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి కేసీఆర్ అందలం ఎక్కించడం.. తమను పక్కకు పెట్టడమే ఆయన బాధకు కారణమని చెప్పినట్టు కనిపిస్తోందని అంటున్నారు. పార్టీ కోసం నిబద్ధత, విధేయత ఉంటే ఏ పార్టీలో ఉన్న భవిష్యత్తు ఉంటుందని గెలుస్తారని ఈటెల అన్నారు.

టీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వారు తిరిగి వస్తాను అని నాతో చెబితే అయితే తాను మాత్రం అలా చేయడం మంచిది కాదని.. ఒక పార్టీలో చేరాక నిబద్ధత చూపాలని చెప్పినట్టు ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News