ఈటల వర్సెస్ టీఆర్ఎస్ .. కార్యకర్తల కొట్లాట

Update: 2021-05-16 16:10 GMT
టీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు పీక్స్ కు చేరింది. మంత్రి పదవి నుంచి ఈటలను తప్పించాక ఆయన కేసీఆర్ వ్యతిరేకులతో సమావేశమవుతూ కాక రేపుతున్నారు. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటి అయిన ఈటల తాజాగా డీఎస్, భట్టి విక్రమార్కతోనూ సమావేశమయ్యారు.

ఇక ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి గంగుల నాయకత్వంలో టీఆర్ఎస్ నేతలను ఈటల వెంట వెళ్లకుండా ప్రలోభపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా ఈటలనే విమర్శించాడు.

ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ లో ఈటల వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. టీఆర్ఎస్ కార్యకర్తలు, ఈటల వర్గీయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఇవాళ వీణవంకలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రెస్ మీట్ రసాభాసగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టారు. సరిగ్గా ఈటల వర్గీయులు అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. ఇక్కడే టీఆర్ఎస్ నేతలు, ఈటల వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం ఈటల వర్గీయులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడే కాదు.. నియోజకవర్గంలో ఇప్పుడు చాలా చోట్ల ఇలాంటి గొడవలే రెండు వర్గాల మధ్య సాగుతున్నాయి.

ఈటల పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. ఈటల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల భట్టితో భేటి అయ్యారు. ఇక బీజేపీ కూడా ఈటలను తీసుకోవాలని లైన్లో ఉంది.
Tags:    

Similar News