కరోనా లాంటి కష్ట కాలంలో మానవత్వం చూపించాల్సిన హాస్పిటల్స్ కొన్ని , ఇదే సరైన సమయంగా భావించి కోట్లు వెనుకేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి సమస్య తీరిపోయే వరకు కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండేలా ఫీజులు వసూలు చేయాలనీ ప్రభుత్వం ఎన్ని సార్లు చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు. శవాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు. కరోనా అని హాస్పిటల్ లో చేరితే లక్షలు లక్షలు బిల్లులు వేసి .. ఉన్న ప్రాణాలను తీసేస్తున్నారు. ఈ సమయంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువైయ్యాయి. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించినా కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మారడం లేదు. భాదితుల ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచనే లేదు. ప్రభుత్వం ఇప్పటికే రెండు ఆసుపత్రులపై చర్యలకు దిగింది. మరికొన్ని ఆసుపత్రుల అక్రమాలపై నివేదికలు సిద్ధమయ్యాయి. వాటిపైనా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది.
ఇంత జరుగుతున్నా చాలా ప్రైవేట్ - కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మారట్లేదు. దీంతో ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. గురు - శుక్రవారాల్లో ఒకరోజు ప్రైవేట్ - కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాలని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయించారు. కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 84,544కి చేరుకుంది. ఇప్పటివరకు 654 మంది చనిపోయారు. నగరాలు - పట్టణాల నుంచి పల్లెల దిశగా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. దీంతో ప్రభుత్వ - ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులతో నిండుగా కనిపిస్తున్నాయి. కరోనా సామాజికవ్యాప్తి జరగడంతో ఇప్పుడు ప్రజలను ఆదుకోవడంపైనే ప్రభుత్వాలు - ప్రైవేట్ సంస్థలు దృష్టిసారించాలి. కానీ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఈ కల్లోల పరిస్థితుల్లోనూ ధనార్జనను వీడట్లేదు. దీనితో ప్రభుత్వం ఇక రంగంలోకి దిగాలని భావిస్తుంది.
సామాజిక బాధ్యతతో మెలగాల్సిన సమయమిది. ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోకపోగా ధనార్జనే ధ్యేయమా మిమ్మల్ని ఎవరూ క్షమించరని మంత్రి ఈటల అన్నట్లు తెలుస్తుంది. కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ తెలంగాణ అంటువ్యాధుల నియంత్రణ–2020 నోటిఫికేషన్ ను ప్రభుత్వం మార్చిలోనే అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు - కార్పొరేట్ ఆసుపత్రులపై సర్కారుకు సర్వాధికారాలుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం ప్రకారం ఆయా ప్రైవేట్ - కార్పొరేట్ ఆసుపత్రులకు బుద్ది చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.