నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం: ఈటల జమున సవాల్

Update: 2022-06-30 12:30 GMT
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రేపో మాపో ఆ భూములను సంబంధిత రైతులకు పంపిణీ చేస్తారా? అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలోని జమున హ్యాచరీస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులున్నారు. అధికారులతోపాటు పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు.తుఫ్రాన్ లో రాత్రంతా అధికారులు బిజిబిజీగా గడిపారు. ఈటల భూముల పంపిణీ వ్యవహారంపై మూడు రోజులుగా కలెక్టర్ హరీష్ తో కలిసి తహసీల్దార్, కార్యాలయ అధికారులు పనిచేస్తున్నారని చెబుతున్నారు.ఈరోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

కబ్జా జరిగినట్టు తేల్చిన అధికారులు రైతుల భూముల్లో హద్దులు కూడా ఖరారు చేసినట్టు సమాచారం అందుతోంది.ఇప్పటికే రెండు సార్లు ఆ భూముల్లో సర్వే నిర్వహించారు అధికారులు. 56 మంది రైతులకు సంబంధించిన 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టుగా చెబుతున్నారు.

కబ్జా చేసిన ఈటల రాజేందర్ భూములను రైతులకు పంచేందుకు రెడీ అయిన కేసీఆర్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు ఈటల జమున. ఈటల రాజేందర్ సతీమణి అయిన జమున ఈ మేరకు తొడగొట్టారు. తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని ఈటల జమున స్పష్టం చేశారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు.

హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేపు సీఎం కేసీఆర్ అధికారులను తీసుకొని రావాలని.. తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదని తెలిపారు.

కేసీఆర్ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఈటల జమున ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామని స్పష్టం చేవారు.

2016లో పెద్ద యెత్తున హాచరీస్ పరిశ్రమ పెట్టాలని  ఈటెల నిర్ణయించారు.. జమున హేచరీస్ ను మెదక్ జిల్లాలోని అస్సలు భూమికి విలువ లేని బంజరు భూములున్న అచ్చంపల్లి, హకీంపేట గ్రామాల్లో పెట్టారు. 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తర్వాత విస్తరణ కోసం మరో 40 ఎకరాలను కొనుగోలు చేశారు. కెనరా బ్యాంకు నుంచి వంద కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఈటల రాజేందర్ కొన్నవి అసైన్డ్ భూములు కావడంతో ప్రభుత్వం స్వాధీనానికి డిసైడ్ అయ్యింది.
Tags:    

Similar News