ఈవీఎంల మోసం అని బీజేపీవోళ్లే ఒప్పుకున్నారా?

Update: 2019-10-17 10:51 GMT
దేశంలో బీజేపీపై సగానికి పైగా మంది వ్యతిరేక గళం వినిపిస్తున్నారని.. అయినా బీజేపీ ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని అప్పట్లో  ప్రకాష్ రాజ్ లాంటి నటులు సందేహం వ్యక్తం చేశారు. అయితే అది నిజంగా ప్రజా గెలుపో.. లేక కాంగ్రెస్ ఆరోపించినట్టు ఈవీఎంల మ్యాజికో తెలియదు కానీ బీజేపీ అయితే రెండోసారి కూడా అఖండ మెజార్టీతో గెలిచేసింది.

తాజాగా మహారాష్ట్ర - హర్యానా ఎన్నికలకు కూడా బీజేపీ రెడీ అయ్యింది. అయితే ఈ సమయంలోనే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. ఈవీఎం అంటే ‘ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ’ అని ఎవ్రీ ఓట్ ఫర్ మనోహర్ అని చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.

పార్లమెంట్ కు మోడీకి - రాష్ట్రానికి మనోహర్ కు ఓటు అని హర్యానా సీఎం ట్వీట్ చేశారు.. హర్యానాలో బీజేపీకి 75కు పైగా సీట్లు గెలుస్తుందన్నారు.

 సీఎం మనోహర్ ట్వీట్ దుమారం రేపింది. ఇప్పటికే ఈవీఎంలపై సార్వత్రిక ఎన్నికల తర్వాత అనుమానాలు రేకెత్తాయి. ఇప్పుడు హర్యానా సీఎం దానికి ఊతమిచ్చేలా ఓట్లన్నీ బీజేపీకే పడుతాయని జోస్యం చెప్పడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు చేసింది. సీఎం స్థాయి వ్యక్తే ఈవీఎంల మిషన్లపై చర్చ జరుగుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ ట్యాంపరింగ్ చేసిందనడానికి నిదర్శనం అని ఆరోపించింది.. దీన్ని బట్టి ఈవీఎంలతోనే బీజేపీ గెలుస్తోందా అన్న అనుమానాలకు బలం చేకూరేలా ఈ సీఎం వ్యాఖ్యలున్నాయని  కౌంటర్ ఇచ్చింది.

   

Tags:    

Similar News