అతడి కంటే ఘనుడు.. అంటూ పాత సామెత ఒకటి ఉంది. ఇప్పుడు జగన్ పార్టీకి చెందిన ఎక్స్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇదే రీతిలో ఉంది. పార్టీ నుంచి ఇటీవల జంప్ అయి ఏపీ అధికారపక్ష గూటికి చేరిన 8 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ పరీక్ష ఒకటి పెట్టటం తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిపే సమయంలో ఓటింగ్ లో తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కచ్ఛితంగా హాజరు కావాలని విప్ జారీ చేసింది.
విప్ జారీ చేసిన తర్వాత వారు హాజరుకాని పక్షంలో వేటు పడే వీలుంది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది ఒకప్పటి జగన్ ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. తమ ఎక్స్ బాస్ వేసిన ఎత్తుకు పైఎత్తు వేసిన 8 మంది ఎమ్మెల్యేలు తమకు ఆరోగ్యం బాగోలేదంటూ తాజాగా మెడికల్ లీవ్ లెటర్స్ ను ఏపీ స్పీకర్ కు పంపారు.
వీరి బాటలోనే తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతుల నెహ్రు.. ఆయన సన్నిహితుడు ఉన్నారు. తాజా విప్ తోపార్టీ నుంచి జంప్ అయిన వారి పని పట్టొచ్చన్న ఆలోచనలో జగన్ పార్టీ ఉంటే.. వారు ఊహించని విధంగా ఝలక్ ఇవ్వటంతో.. పైఎత్తు ఏం వేసి.. వారికి చెక్ చెప్పాలో అర్థం కాక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారు.