వేరియంట్ల పై నిపుణుల అధ్యయనాలు.. కారణమేంటో తెలుసా?

Update: 2022-05-07 12:35 GMT
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తన రూపు ను మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్లతో జనాలను ఇప్పటికీ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వల్ల కల్గి ఆర్థిక, సామాజిక నష్టాల నుంచి ఇప్పటికీ కోలుకోలేక పోతున్నాం. అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల తదుపరి వైరస్ కారణం అవుతున్నాయని తాజా అధ్యయనం అంచనా వేసింది.

విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలి రావడం... దాంతో వైరస్ లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. జుంతువులను ఒకే చోట చేర్చడంతో అత్యవసర పరిస్థితులకు కారణం అయ్యే ప్రమాదాలను సృష్టిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మధ్యంతర జీవులకు, అక్కడ నుంచి ప్రజలకు వైరస్ సోకే పరిస్థితులకు దారి తీస్తాయని చెబుతున్నారు.  

ఎబోలా, కరోనా వంటి వైరస్ లు కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి ఇవి అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్నారు. దాంతో మూలాలను గుర్తించలేని విధంగా మారడంతో పాటు వన్య ప్రాణుల నుంచి మానవులలోకి వైరస్ లు ప్రవేశించేందుకు వాతావరణ మార్పులు కారణం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వేడి వాతావారణం ఉన్న కారణంగా ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలు కావచ్చిన  శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూతాపం తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని ఆపలేకపోవచ్చని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల పెరుగుదల గబ్బిలాలపై ప్రభావం చూపించ వచ్చని వివరిస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లే సామర్థ్యం కారణంగా వైరస్ ల విస్తరణ మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. అందుకే వేసవి కాసం తగ్గే వరకు ఎక్కువగా బయటకు రాకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎండల వల్ల వైరస్ ల వ్యాప్తే కాకుండా ఉష్ణ సంబంధ వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

ముఖ్యంగా అనేక ఇతర సమస్యలతో బాధ పడేవారిని అందులోనూ వృద్ధులు, పిల్లలను ఎక్కువగా జనాలు ఉన్న చోట తిప్పకూడదని సూచిస్తున్నారు. వేసవి కాలం పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉంటేనే ప్రణాలను రక్షించుకోవచ్చని చెబుతున్నారు.

అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలని... పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, సీజనల్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అలాగే రెండు డోసుల కరోనా టీకాలతో పాటు బూస్టర్ డోసును కూడా తీసుకోవాలని పేర్కొంటున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఎండలో బయటకు రాకూడదని చెబుతున్నారు.
Tags:    

Similar News