ర‌ష్యా మెట్రోలో పేలుడు.. ప‌ది మంది మృతి

Update: 2017-04-03 13:52 GMT
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో మెట్రోలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. సెయింట్ పీట‌ర్స్‌ బ‌ర్గ్‌ మెట్రో స్టేష‌న్ లో బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది మృతిచెందారు. మ‌రో 20 మంది గాయ‌ప‌డ్డారు. మెట్రో స్టేష‌న్ నుంచి ప్ర‌యాణికుల‌ను త‌ర‌లిస్తున్నారు. ముందుజాగ్ర‌త్త‌గా కొన్ని స్టేష‌న్ల‌ను మూసివేశారు. ఈ ఘటనకు ఎవరు కారకులనేది ఇంకా తెలియరాలేదు.

సెన్నాయ్ స్టేష‌న్‌ సబ్ వేలో పేలుడు జ‌రిగిన‌ట్లు ట్రాన్సిట్ సిస్ట‌మ్ పేర్కొఃది. ఐఈడీ బాంబుతో బోగీని పేల్చివేసిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. పీట‌ర్స్‌ బ‌ర్గ్ మెట్రో వ్య‌వ‌స్థ‌కు చెందిన సుమారు ఎనిమి స్టేష‌న్ల‌ను మూసివేశారు. బాంబు పేలుడు జ‌రిగిన బోగీ వ‌ద్ద కొన్ని మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. ర‌క్త‌పు మ‌ర‌క‌లు కూడా క‌నిపిస్తున్నాయి. అగ్నిమాప‌క సిబ్బంది పేలుడు ప్ర‌దేశానికి చేరుకున్నారు.

సెయింట్స్ పీటర్స్ బర్గ్ లో జరిగిన పేలుడుపై దేశాధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు. ఘటనపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాద అంశాన్ని కూడా అనుమానిస్తున్నట్లు తెలియజేశారు. పేలుడు బాధితులకు పుతిన్ సంతాపం తెలిపారు. సెయింట్ పీటర్స్ బర్గ్ ఘటనతో మాస్కోలోనూ అప్రమత్తత ప్రకటించారు. గాయపడ్డవారిలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News