అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఏది చేసినా అదొక సంచలనమే. ఏ విషయంలో అయినా కూడా ట్రంప్ స్పందించే తీరు అందరికంటే కొంచెం భిన్నంగా ఉంటారు. ముఖ్యంగా అయన అమెరికా అధ్యక్షుడిలా కాకుండా.. ప్రతి విషయం పై అమెరికన్ జాతీయవాద పౌరుడిలా స్పందిస్తుంటారు. అలాగే నిత్యం వివాదాస్పద ట్విట్ల తో విరుచుకుపడుతుంటారు.
తాజాగా అయన చేసిన ఓ ట్విట్ ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. మినియాపొలిస్ లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతి అమెరికన్ పౌరుడిని ఒక అమెరికన్ పోలీసు మోకాలితో గొంతుపై ఎనిమిది నిముషాలపాటు తొక్కి ఉంచి, ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన అమానుష దుశ్చర్యపై అమెరికా అంతటా నిరసన లూటీలు మొదలయ్యాయి. ఈ లూటీలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్..వెన్ లూటింగ్ స్టార్ట్స్, ది షూటింగ్ స్టార్ట్స్ అంటూ ట్విట్ చేసారు (అంటే దోపిడీ మొదలవగానే కాల్పులు కూడా మొదలవుతాయి).
దీనిపై నిరసనకారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తమను గూండాలతో పోల్చడంపై ఆగ్రహించిన వారు.. ట్రంప్ ట్వీట్ హింసను ప్రేరేపిస్తోందని ఫిర్యాదు చేసారు. దీంతో ఆ ట్వీట్ ను హైడ్ చేస్తూ ట్విట్టర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అలాగే ఫేస్ బుక్ ని కూడా అలా చేయమని తెలిపింది. అయితే, దానికి ఫేస్ బుక్ నిరాకరించింది. 'పర్యవసానాలను ప్రజలకు తెలియకుండా దాచేస్తే మరింత నష్టం జరుగుతుంది. ట్రంప్ ట్వీట్‌ని ఆయన చేసిన ప్రకటనలా చూడకూడదు. ఆయన చెప్పిన వాస్తవంలా పరిగణించాలి' అని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.