ప్రపంచవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులకు ప్రాణభీతి ఎదురైంది. మూడేళ్లుగా తమ రాజధాని నగరంగా మలుచుకున్న ఇరాక్‌లోని మోసుల్‌లో ముప్పేట దాడికి గురైన ఐఎస్ ఉగ్రవాదులు ప్రాణాలు రక్షించుకొనేందుకు సమీపంలోని టైగ్రిస్ నదిలో దూకారు. సంకీర్ణ దళాలు ఉగ్రవాదులను తరుముతున్న క్రమంలో 30 మంది టైగ్రిస్ నదిలో దూకారని, వారిని వెంటాడి కాల్చి చంపామని ఇరాక్ సైనిక ప్రతినిధి రసూల్ చెప్పారు. మోసుల్ నగరం మధ్యనుంచి వెళ్లే టైగ్రిస్ నదికి పశ్చిమ దిశలో ఇంకాకొంత భాగం ఉగ్రవాదుల స్వాధీనంలోనే ఉందని ఇరాకియా న్యూస్ చానెల్ తెలిపింది.
ఐసిస్‌ను తరిమికొట్టి, వారి ఆధీనంలో ఉన్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ఇరాక్ ప్రధాని హైదర్-అల్-ఆబాదీ ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు ఇది పెద్ద పరాభవమని ఆయన అన్నారు. ఇరాక్ సైన్యం స్వాధీనం చేసుకున్న మోసుల్ నగరాన్ని ఆదివారం సందర్శించిన ఆయన అక్కడి సైన్యాన్ని, స్థానిక ప్రజల్ని అభినందించారు. ఉత్తర ఇరాక్‌లో టైగ్రిస్ నదీతీరాన ఉన్న మోసుల్ నగరాన్ని మూడేళ్ల కిందట జీహాదీ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని మత రాజ్య స్థాపనకు తొలిమెట్టుగా ఐసిస్ ప్రకటించింది. మోసుల్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తొమ్మిదినెలలుగా ఇరాక్ జాతీయ సైన్యం పోరాడుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది మృత్యువాతపడగా, సుమారు పదిలక్షల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
అక్టోబర్ లో మోసుల్ స్వాధీనానికి యుద్ధం ప్రకటించిన ఇరాక్ సైన్యం పలు దేశాల సంకీర్ణసైన్యంతో కలిసి సుదీర్ఘ పోరాటం నెరిపింది. ఉగ్రవాదుల చెర నుంచి నగరానికి విముక్తి లభించిందని, మోసుల్ ఇప్పుడు స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నదని ప్రధాని హైదర్-అల్-ఆబాదీ ప్రకటించారు. ఆయన మిలిటరీ దుస్తుల్లో మోసుల్ కు వెళ్లినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు నగరంలో ఇంకా కొన్నిచోట్ల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. నగరం పూర్తిగా హస్తగతమైనేట్లనని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. మోసుల్ లో ఐసిస్‌పై విజయం సాధించామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్విట్టర్ లో తెలిపారు. తమ బలగాలు కూడా ఈ విజయంలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.