వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ 19 నెలల పాలనలో 16 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ కోరల నుంచి విముక్తి పొంది పల్నాడులో వైసీపీ నేతలు మళ్లీ హత్యా రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరు
జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పురంశెట్టి అంకులు దారుణ హత్యోదంతం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ వైరంతోనే అంకులును వైసీపీ నేతలు హత్య చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అంకులు కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. అంకులు భార్య పున్నమ్మ, కుటుంబసభ్యులను లోకేష్ ఓదార్చారు. అంకులు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.
అంకులు హత్యోదంతం నేపథ్యంలో సీఎం జగన్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. ఫ్యాక్షన్ నాయకుడు సీఎం అయితే పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు జగన్ పాలనలో చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. కాపునేత అంకులును దారుణ హత్యకు గురయ్యారని, ఈ హత్య వెనుక గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, దాచేపల్లి ఎస్‌ఐ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు కనీస భద్రత కరువైందని, అంకులు హత్యకేసులో దాచేపల్లి ఎస్‌ఐ పేరు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని లోకేష్ నిలదీశారు. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలను ఇక్కడితోనే పుల్‌స్టాప్ పెట్టకుంటే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లోకేష్ హెచ్చరించారు.
అంకులును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఉదంతం పెను దుమారం రేపింది. అంకులును కత్తులతో పొడిచి, మెడకోసి మరీ విచక్షణరహితంగా హత్య చేయడం సంచలనం రేపింది. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే అంకులు కుటుంబంలో మరో విషాదం ఏర్పడింది. అంకులు హత్యతో మనోవేదనకు గురై అంకులు బావమరిది శ్రీనివాస్ మృతి చెందాడు. మానసిక వ్యధతో అంకులు బామ్మర్ది శ్రీనివాస్ కుప్పకూలిపోయాడు. కుప్పకూలిన కొద్ది సేపటికే శ్రీనివాస్ మరణించాడు. రెండు రోజుల వ్యవధిలో వీరిద్దరి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, అంకులు హత్య కేసును చేధించేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. ఆధిపత్య పోరు, అర్థిక లావాదేవీలు, రాజకీయంతోపాటు అన్ని కోణాల్లో విచారణ జరపుతున్నామన్నారు. అంకులుపై గతంలోనూ దాడి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అంకులు ఫోన్ ఇంకా లభ్యం కాలేదని, ఫోన్, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు.