దర్జాగా.. డాబుగా వ్యవహరించే ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తయారు చేస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా ఉంటుందంటారు ఆయన్ను విమర్శించే వారు. చిన్న పనులకు సైతం ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే ఆయన జర్నీ ఖర్చులు ఓ రేంజ్ లో ఉంటాయంటారు. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత భారీగా ఖర్చులు చేయటంపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇంతకీ.. ప్రత్యేక విమానాల్లో తరచూ ప్రయాణించే చంద్రబాబు వాటికి డబ్బులు చెల్లిస్తున్నారా? లేక.. ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బాబు ఉపయోగించే ప్రత్యేక విమానాలకు సంబంధించిన కొన్ని ఆరోపణలు ఈ మధ్య తరచూ వినిపిస్తున్నాయి. ప్రత్యేక విమానాల్ని చంద్రబాబు మీదున్న అభిమానంతో కొందరు ఏర్పాటు చేస్తున్నారంటారు. దీన్లో నిజానిజాలు తేలాల్సి ఉంది. బాబు ప్రయాణించే ప్రత్యేక విమానాలు చాలావరకూ స్పాన్సర్ చేసేవని.. పలువురు బడా కాంట్రాక్టర్లకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు చెందిన విమానాల్ని బాబుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి అవసరాల కోసం తరచూ ప్రత్యేక ఫ్లైట్లను అరేంజ్ చేసే వారి అవసరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమకు అవసరమైన ప్రతిసారీ ప్రత్యేక విమానాల్ని అరేంజ్ చేసే వారి కోసం ఎంతోకొంత చేయాల్సిన బాధ్యత బాబు అండ్ కో మీద ఉంటుంది. తమకు సాయం చేస్తున్న వారికి ప్రతిఫలం అందించేందుకు వెనుకాదటం లేదని.. అందుకే అడిగిన వెంటనే ప్రత్యేక విమానాలు వచ్చి వాలుతున్నాయన్న ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది.
ఇక.. ఈ మధ్య కాలంలో కొన్ని కాంట్రాక్టుల కేటాయింపులో.. ప్రత్యేక విమానాల ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన సిఫార్సుల్ని బాబు అండ్ కో ఓకే చేసినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. వివాదాల మడుగులో చంద్రబాబు తనకు తెలీకుండా కాలేస్తున్నట్లే. ఎందుకంటే.. తన అవసరాల్ని చంద్రబాబు చెప్పేస్తే.. ఆయన వ్యవహారాలు చూసే వారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో తాను ప్రయాణించే ప్రత్యేక విమానం ఎవరిది? ఎవరు అరేంజ్ చేశారన్న విషయాలు బాబు దృష్టికి రాకపోవచ్చు.
కానీ.. రేపు ఏదైనా వివాదం చోటు చేసుకుంటే.. అది బాబు నెత్తికే చుట్టుకుంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. తాను ప్రయాణించే ప్రత్యేక విమానాలకు సంబంధించి లెక్కల డొక్కలు చంద్రబాబు కాస్త చూసుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. ప్రత్యేక విమానాలన్నీ ఫ్రీగా వస్తున్నాయా? లేక.. ఖజానా నుంచి ఖర్చు చేస్తున్నారా? అన్న విషయం మీద కాస్తంత స్పష్టత ఇస్తే.. సందేహాలున్న వారికి సైతం సమాధానం చెప్పినట్లు ఉంటుంది.