న‌కిలీ నోట్ల ప్రింటింగ్ వైర‌ల్ వీడియో..షాకింగ్ నిజాలు!

Update: 2018-01-08 14:42 GMT
గ‌తంలో.....ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రింట్ - ఎల‌క్ట్రానిక్ మీడియాల‌లో వ‌చ్చిన వార్త‌ల‌కు కొద్దో గొప్పో క్రెడిబిలిటీ ఉండేది. కాల‌క్ర‌మంలో ఆ క్రెడిబిలిటీ బొత్తిగా త‌గ్గిపోయింద‌న్న‌ది కొంత‌మంది వాద‌న‌. అదే స‌మ‌యంలో ఫేస్ బుక్ - ట్విట్ట‌ర్ - వాట్సాప్ - యూట్యూబ్ వంటివి బాగా పాపుల‌ర్ కావ‌డంతో సోష‌ల్ మీడియా ఫిఫ్త్ ఎస్టేట్ గా అవ‌త‌రించింద‌నే భావ‌న నెటిజ‌న్ల‌కు వ‌చ్చేసింది.  దీంతో, సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీతంగా స‌మాచారం - వార్త‌లు - వీడియోలు - ఫొటోలు స‌ర్క్యులేట్ అవ‌డం ప్రారంభించాయి. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ కొంద‌రు వ్య‌క్తులు త‌మ‌కు దొరికిన ఫొటోలు - వీడియోల‌కు న‌చ్చిన భాష్యాలు చెప్ప‌డం మాత్ర‌మే కాకుండా....వాటికి సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం ల‌లో విప‌రీతంగా ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు. ఆ వార్త‌ల‌లో ....స‌మాచారంలో నిజానిలేమిటి....అన్న‌ది ఆలోచించేంత తీరిక‌, ఓపిక....అతి కొద్ది మందికి మాత్ర‌మే ఉంటుంది. ఓ లైక్ కొట్టేసి...షేర్ చేయ‌డ‌మో.....ఓ వీడియోను ఫార్వార్డ్ చేసి....ఫార్వార్డెడ్ యాజ్ రిసీవ్డ్ ...అంటూ మెసేజ్ పెడితే పోలా....అనుకునే వారే ఎక్కువ‌. తాజాగా, అటువంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. బంగ్లాదేశ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో వేల కోట్ల‌ రూపాయ‌లు విలువ‌జేసే రూ.200 - రూ.50 న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ను ముద్రిస్తున్నార‌నన్న‌ వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో విప‌రీతంగా వైరల్ అవుతోంది. శ‌నివారం మొద‌లైన ఆ వీడియో స‌ర్క్యులేష‌న్ ఇప్ప‌టికీ దిగ్విజ‌యంగా కొన‌సాగుతూనే ఉంది.

తాజాగా, తేలిన విష‌యం ఏమిటంటే.....ఆ ప్రింటింగ్ ప్రెస్ లో త‌యార‌వుతోన్నవి భార‌తీయ క‌రెన్సీని స‌రిపోలిన న‌కిలీ నోట్లు కావ‌ట‌. అచ్చం ఒరిజిన‌ల్ నోట్ల మాదిరిగానే క‌నిపిస్తోన్న ఆ నోట్ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే....వాటిపై `చిల్డ్ర‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా` - `భార‌తీయ‌ మ‌నోరంజ‌న్ బ్యాంక్` అని ముద్రించి ఉంటుంది. ఈ విష‌యాన్ని `బూమ్ లైవ్ ఇన్` అనే వెబ్ సైట్ బ‌య‌ట‌పెట్టింది. సోష‌ల్ మీడియాలో - వాట్సాప్ ల‌లో స‌ర్క్యులేట్ అవుతోన్న వీడియోలు - ఫొటోల‌లో ఏవి రియ‌ల్ ? ఏవి వైర‌ల్ ? అన్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డ‌మే ఆ వెబ్ సైట్ ఉద్దేశం. వాస్త‌వానికి సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ అవుతోన్న ఆ వీడియోను గౌర‌వ్ పాంధి అనే కాంగ్రెస్ కార్య‌క‌ర్త ఒక‌రు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేశారు. `` ఆ వీడియోలో క‌నిపిస్తున్న‌వి నిజ‌మైన రూ.200, రూ.50 నోట్లా? ఒక‌వేళ అవి నిజ‌మైన నోట్ల‌యితే....వాటిని ఇంత పెద్ద మొత్తంలో ముద్రిస్తున్న‌దెవరు? అస‌లు భార‌త‌దేశంలో ఏం జ‌రుగుతోంది?`` అంటూ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేసి ఆ వీడియోను జ‌న‌వ‌రి 5 న షేర్ చేశారు. ఆ ట్వీట్ పోస్ట్ అయిన కొద్ది సేప‌టికే....గౌర‌వ్ - జైట్లీల‌ను ట్యాగ్ చేస్తూ ....ఆ వీడియోకు `బూమ్ లైవ్ ఇన్` రిప్లై ఇచ్చింది.

ఆ నోట్ల మీద భార‌తాయ చిల్డ్ర‌న్ బ్యాంక్ అంటూ ముద్రించి ఉందని - అవి ఫేక్ నోట్లని తేల్చి చెప్పింది. ఆ ట్వీట్ కు బ‌దులుగా గౌర‌వ్ మ‌రో ట్వీట్ చేశారు. బూమ్ లైవ్ ఇన్ చెప్పిన‌ట్లు అవి న‌కిలీ నోట్లేన‌ని గౌరవ్ అంగీక‌రించారు. అయితే, ఇవే చిల్డ్ర‌న్ బ్యాంక్ నోట్లు....పెద్ద నోట్ల ర‌ద్దు అనంతరం దేశంలోని ఏటీఎంల‌లో ప్ర‌త్య‌క్ష్య‌మ‌య్యాయ‌ని గుర్తు చేశారు. ``కార‌ణాలేమైన‌ప్ప‌టికీ ఇటువంటి నోట్ల‌ను య‌థేచ్ఛ‌గా ముద్రిస్తున్న వారిపై చ‌ర్య‌లెందుకు తీసుకోవ‌ట్లేదు?`` అంటూ అరుణ్ జైట్లీని ప్ర‌శ్నించారు.  గ‌త ఏడాది ఢిల్లీలోని సంగ‌మ్ విహార్ ఏటీఎంలో `చిల్డ్ర‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా` అని ముద్రించి ఉన్న న‌కిలీ రూ.2000 నోట్లు వ‌చ్చిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే, గ‌త ఏడాది డిసెంబ‌రు 27న బంగ్లాదేశ్ లో న‌కిలీ భార‌తీయ క‌రెన్సీని  త‌యారు చేస్తోన్న ఓ ముఠాను అక్క‌డి పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.10 ల‌క్ష‌ల విలువ గ‌ల న‌కిలీక‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో రూ.200 - రూ.50 నోట్ల‌ను కూడా బంగ్లాదేశ్ లో ముద్రించి ఉంటార‌ని చాలామంది భావించి ఆ వీడియోను షేర్ చేసి ఉండ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మోనోపొలీని పోలి ఉండే బోర్డ్ గేమ్ కోసం ఆ నోట్ల‌ను ముద్రించి ఉంటార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవి న‌కిలీ నోట్ల‌ని, వాటిపై భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ అని లేదు కాబ‌ట్టి ఈ నోట్లు మార్కెట్లోకి వ‌చ్చినా పెద్ద ప్ర‌మాదం లేద‌ని అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే ఆ నోట్లు నిర‌క్ష‌రాస్యుల చేతిలో ప‌డితే వాటిని గుర్తించే ప‌రిస్థితులు ఉండ‌క‌పోవ‌చ్చు.  గ‌త ఏడాది లాగానే ఈ నోట్లు ఏటీఎంల‌లో ద‌ర్శ‌న‌మిస్తే ప‌రిస్థితేమిట‌ని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు, గ‌త ఏడాది ఏటీఎంలో బ‌య‌ట‌ప‌డ్డ రూ.2000 చిల్డ్ర‌న్ బ్యాంక్ నోటు ఎలా వ‌చ్చింద‌న్న విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేదు. ఇపుడు తాజాగా ఈ నోట్ల ముద్రణ ప్ర‌జ‌ల‌లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. కాబ‌ట్టి, ప్ర‌భుత్వం ఆ నోట్ల ముద్రణ జ‌రుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి ఇటువంటి న‌కిలీల‌ల‌ను అరిక‌ట్టాని నెటిజ‌న్లు కోరుతున్నారు.

Full View
Tags:    

Similar News