సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ వ్యాప్తి అనేది భారీగా పెరిగింది. ఏ చిన్న న్యూస్ ఉన్నా కూడా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోకమునుపే సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అందులో చాలా వరకు తప్పుడు వార్తలే ఉన్నాయి. ఇలా సోషల్ మీడియా లో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పోలీసులు కొరడా ఘళిపిస్తున్నారు. నైట్ కర్ఫ్యూ తొలిరోజు ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేశారంటూ ఫేక్ వీడియో వైరల్ చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ని 24 గంటల్లోనే అరెస్ట్ చేసి తీవ్ర హెచ్చరికలు పంపిన సంగతి తెలిసిందే.
తాజాగా కరోనా బారిన పడిన కేసీఆర్ ఆరోగ్యంపై వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసిన ఇధ్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఇద్దరు యువకులు కేసీఆర్ ఆరోగ్యంపై ఫేక్ న్యూస్ వైరల్ చేశారట. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన శేఖర్ అనే రైతుతో పాటు, హైదరాబాద్ వనస్థలిపురంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారట. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ప్రజల్లో అపోహలు తలెత్తేలా ప్రచారం చేసిన నేరానికి వీరిద్దరిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అంజనీకుమార్ వెల్లడించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు కలిపి ఈ కేసును ఛేదించారని తెలిపారు. సోషల్‌మీడియాలో ఫేక్ న్యూస్, వీడియోలు, ఫోటోలను ఎవరైనా పోస్ట్ చేసినా, గ్రూపుల్లో షేర్ చేసినా కఠినచర్యలు తప్పవని పోలీసులు చెప్తున్నారు.
తెలంగాణలో అందరికీ ఉచితంగా కొవిడ్ వ్యా్క్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర జనాభా మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 4 కోట్ల మంది దాకా ప్రజలు ఉన్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా వాక్సినేషన్ ఇస్తామని కేసీఆర్ నిర్ణయించారు.