మీడియా స్థానాన్ని సోషల్ మీడియా చేజిక్కించేందుకుంది. హద్దుల్లేనట్లుగా మారిన ఈ మీడియాతో ప్రజలకు బోలెడంత సమాచారం అందుతున్నా.. ఏది నిజం? ఏది అబద్ధం? అన్నదిప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీంతో దేన్ని నమ్మాలో..? దేన్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఈ కన్ఫ్యూజన్ ను మరింత పెద్దది చేస్తూ.. ఎక్కడో ఏదో చోటు చేసుకున్న విషయాన్ని లింకు చేస్తూ.. వైరల్ అవుతున్న సమాచారంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది జంతువులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న దుర్మార్గపు ప్రచారం.
కరోనా కారణంగా పక్కనున్న మనిషిని నమ్మలేని పరిస్థితి. కాస్త గట్టిగా దగ్గితే చాటు.. వణికిపోతున్న వేళ.. జంతువులతో కరోనా వస్తుందంటే.. మూగజీవాలకు కొత్త సమస్య ఎదురైనట్లే. అందులోకి కుక్కలు.. పిల్లులు కరోనా వైరస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారతాయన్న ప్రచారం ఊపందుకుంటుంది. ఇలాంటివేళ.. వీటిని ఖండించటమే కాదు.. తెలిసిన వారికి అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలి.
న్యూయార్క్ లోని జూ పార్కులో పులికి కరోనా సోకిన నేపథ్యంలో.. జంతువులతో కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చెలరేగిపోతోంది. దీన్ని జంతుప్రేమికులు పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. మూగజీవాలు ప్రేమను పంచుతాయే కానీ.. వైరస్ ను పంచవన్న ప్రచారాన్ని షురూ చేశారు. దీనికి తగ్గట్లే బీజేపీ సీనియర్ నేత.. జంతుప్రేమికురాలు మేనకాగాంధీ రంగంలోకి దిగారు. కుక్కలు.. పిల్లులు కరోనా వ్యాపకాలు కాదని.. లాక్ డౌన్ నేపథ్యం లో వాటికి ఆహారం అందించాలని కోరుతున్నారు.
సోషల్ మీడియాలో సాగే ఫేక్ ప్రచారం పుణ్యమా అని కొత్త సమస్యలు ఎదురుకావటమే కాదు.. ఈ మూగజీవాల్ని చంపే దుర్మార్గం షురూ అవుతుందని.. అందుకే.. మొదట్లోనే ఈ తప్పుడు ప్రచారాన్ని నిలువరించాల్సిన అవసరం అందరి మీదా ఉంది.