ప్రస్తుతం కరోనా తో ప్రజలు ఓ వైపు హడలి పోతుంటే, మరోవైపు కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యాంటీ కోవిడ్ వైరల్ డ్రగ్ రెండెసివిర్ పేరుతో నకిలీ రెండెసివిర్ ను విక్రయిస్తున్న ఓ నర్సు బాగోతం కర్ణాటకలో వెలుగుచూసింది. ఖాళీ అయిన రెండెసివిర్ వయల్స్ లో సదరు నర్సు సెలైన్ వాటర్, ఇతరత్రా యాంటీ బయాటిక్స్‌ను నింపి విక్రయిస్తుండటం గమనార్హం. మైసూరు పోలీస్ కమిషనర్ చంద్రగుప్తా వెల్లడించిన వివరాల ప్రకారం .. రెండెసివిర్ డ్రగ్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో కొన్ని చోట్ల దాడులు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో గిరీష్ అనే మేల్ నర్సు రెండెసివిర్ పేరుతో నకిలీ డ్రగ్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.
వివిధ కంపెనీలకు చెందిన రెండెసివిర్ బాటిల్స్ ను రీసైక్లింగ్ చేసి , వాటిలో సెలైన్,యాంటీ బయాటిక్స్ నింపి అదే మెడికల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిజానికి 2020 నుంచే అతను ఈ దందా నడిపిస్తున్నట్లు గుర్తించామని కమిషనర్ చంద్ర గుప్తా తెలిపారు. మొత్తం 2.82లక్షలు విలువ చేసే 41 నకిలీ రెండెసివిర్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హెల్త్ కేర్ రంగంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి ద్వారా గిరీష్ రెండెసివిర్ ఖాళీ వయల్స్‌ను తెప్పించుకున్నట్లు గుర్తించామన్నారు. గిరీష్ కు పరిచయం ఉన్న మంజునాథ్,ప్రశాంత్ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆ నకిలీ రెండెసివిర్ ను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. 4
అంతేకాదు,బ్లాక్ మార్కెట్ లోనూ గిరీష్ రెండెసివిర్ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. సోమవారం(ఏప్రిల్ 19) నాటికి 900 నకిలీ రెండెసివిర్ వయల్స్‌ను గిరీష్ విక్రయించినట్లు మరో పోలీస్ అధికారి వెల్లడించారు. రెండెసివిర్ ఖాళీ వయల్స్ ను తీసుకురావడంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మంగళ అనే హౌస్ కీపింగ్ సిబ్బంది,మరో ఆస్పత్రిలో పనిచేస్తున్న శివప్ప అనే సెక్యూరిటీ గార్డు సహకరించినట్లుగా గుర్తించామన్నారు. ఈ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు... అన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మైసూరులోని నజర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 276,సెక్షన్ 420,సెక్షన్ 34ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. కరోనా కేసులు పెరిగి హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమవుతున్న తరుణంలో రెండెసివిర్ వైరల్ డ్రగ్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో కొందరు ఈ సమయంలో కూడా సరికొత్త దందా కి తేరా తీస్తున్నారు.