సకుటుంబ సపరివార పాలిటిక్స్

Update: 2019-05-05 11:01 GMT
టీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. అయితే పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ మరోసారి బయటపడ్డాయి. పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కుటుంబ సభ్యులను తెరమీదకు తీసుకొచ్చి పరిషత్ లో పాగా వేయాలని అడుగులు వేస్తున్నారు..

వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా తాజాగా టీఆర్ఎస్ లో చేరిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి భార్య గండ్రజ్యోతిని టీఆర్ఎస్ బరిలో దించింది. ఇక యాదాద్రి జడ్పీ చైర్మన్ కు మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి బరిలో ఉన్నాడు. మంచిర్యాల జడ్పీ చైర్మన్ బరిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భార్య భాగ్యలక్ష్మీని బరిలో దింపారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి మహేశ్వర మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి, వికారాబాద్ కు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య సునీతను టీఆర్ఎస్ బరిలో దింపింది. మహబూబ్ నగర్ కు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి భార్య స్వర్ణను దించారు.

ప్రధాన పక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే ఫ్యామిలీ పాలిటిక్స్ కు జై కొట్టింది. నల్లగొండ జడ్పీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోదరుడు మోహన్ రెడ్డిని కాంగ్రెస్ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక నాగర్ కర్నూలు జడ్పీ చైర్మన్ కు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ భార్య అనురాధాను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. యాదాద్రికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే నగేశ్ ను  అభ్యర్థిగా ప్రకటించారు.

ఇలా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పరిషత్ ఎన్నికల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నాయి. రెండు పార్టీల్లో నేతల కుటుంబీకులకే టికెట్లు దక్కడం విశేషం.
Tags:    

Similar News