భార‌త్‌కు పొంచి ఉన్న మ‌రో ముప్పు!

Update: 2020-04-29 02:30 GMT
ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న భార‌త‌దేశానికి మ‌రో భారీ ముప్పు పొంచి ఉంది. అదే మిడ‌త‌లు. ఇప్ప‌టికే ఎడారి ప్రాంత దేశాల్లో విజృంభించి అక్కడ తీవ్ర న‌ష్టం ఏర్ప‌రిచిన మిడ‌త‌ల దండు త్వ‌ర‌లోనే భార‌త‌దేశంలోకి ప్ర‌వేశించ‌నుంది. మిడ‌త‌లు ఒక్క‌సారిగా దండెత్తి పంట‌ల‌న్నింటినీ నాశ‌నం చేసే అవ‌కాశం ఉంద‌ని రాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) హెచ్చ‌రిస్తోంది. తూర్పు ఆఫ్రికా దేశాల్లో భీకరంగా మిడతల దండు దాడి చేసి తీవ్ర నష్టం సృష్టిస్తున్నాయి. ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌లో మిడ‌త‌లు ఇప్పుడు భార‌త్‌లో ప్ర‌వేశించ‌నున్నాయ‌ని ఎఫ్ఏఓ వెల్ల‌డించింది.

భార‌త‌దేశంలోని రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో గ‌తంలో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం మిడ‌త‌లు చేశాయి. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు మిడ‌త‌లు నాశనం చేశాయి. ప్ర‌స్తుతం 20 రెట్లు అధిక సంఖ్యలో మిడతల దండు విజృంభించ‌నుంద‌ని, ఇదే విధంగా కొన‌సాగితే జూన్‌ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని ఐక్య‌రాజ్య స‌మితి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.

ఆఫ్రికా దేశాల నుంచి మిడతల దండు భార‌త్‌లోకి ప్ర‌వేశించ‌నుంది. జూన్‌ నాటికి భారత్‌లోని పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లోకి రానున్నాయి. ఆ దండు చుట్టుముట్టి పంటలకు నష్టం కలిగించే ముప్పు పొంచి ఉందని ఎఫ్ఏఓ హెచ్చరించింది.

అయితే కేవ‌లం మిడ‌త‌లే కదా.. అవేం చేస్తాయి అని అనుకుంటే పొర‌పాటే. క‌రోనా వైర‌సే క‌దా అని తీసి పారేస్తే ఇంత విప‌త్తు దేనివ‌ల‌న! కంటికి క‌నిపించ‌ని ఆ వైర‌సే తీవ్రంగా న‌ష్టం చేకూరుస్తుండ‌గా ల‌క్ష‌లు, కోట్లాది సంఖ్య‌లో వ‌చ్చే మిడ‌త‌లు మ‌నుషుల‌కేమో కాని రైతులు పండించిన పంట‌పొలాల‌పై తీవ్రంగా దాడి చేయ‌నున్నాయి. వాటికి ఆహారంగా పంట‌పొలాల‌న్నింటిని తినేసి చివ‌ర‌కు కట్టెలు మాత్ర‌మే మిగ‌ల‌నున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఒక్క‌సారిగా ఆహార కొర‌త ఏర్ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది. అందుకే ఐక్య‌రాజ్య స‌మితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప‌లు దేశాల‌ను హెచ్చ‌రించింది. ముందే జాగ్ర‌త్త ప‌డితే ఆ మిడ‌త‌ల దండును ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల‌ని సూచిస్తోంది.
Tags:    

Similar News