రోడ్ల దుస్థితిపై రైతు వినూత్న నిర‌స‌న‌..వైర‌ల్!

Update: 2018-08-12 05:52 GMT
వ‌ర్షాకాలంలో మ‌న దేశంలోని రోడ్లు ఎంత అధ్వాన్నంగా త‌యార‌వుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో రోడ్లు....చెరువులు - కుంట‌ల‌ను త‌ల‌పిస్తాయి. ప్ర‌తి ఏడాది...తూతూ మంత్రంగా రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేసి చేతులు దులుపుకోవ‌డం ప్ర‌భుత్వానికి పరిపాటి. ఇక ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త‌ను ఎత్తి చూపుతూ ప్ర‌తిప‌క్షాలు - న‌గ‌ర పౌరులు రోడ్ల‌పై నాట్లువేయ‌డం...వంటి దృశ్యాలు మ‌నం చూశాం. అయితే, తెలంగాణ‌లోని మ‌హబూబ్ న‌గ‌ర్ లోని ఓ రైతు....రోడ్ల‌పై వ‌రి మొక్క‌ల నాట్లు వేస్తూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని ఎత్తి చూపుతున్నాడు. వినూత్న త‌ర‌హాలో ఆ రైతు నిర‌స‌న తెలుపుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మామిడి పండ్ల‌కు ఓ సీజ‌న్ ఉన్న‌ట్లే....అధ్వాన్న‌మైన రోడ్ల దుస్థితి బ‌య‌ట ప‌డాలంటే ...వర్షాకాలం సీజ‌న్ రావాల్సిందే. ఈ సీజ‌న్ లో ప‌ల్లెలు మొద‌లుకొని ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ....దాదాపుగా ప్ర‌జ‌లంద‌రికీ ఏదో ఒక రూపంలో రోడ్ల‌పై ఈత కొట్టే వెసులుబాటును ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంది. కొత్తగా వేసే నాసిర‌కం రోడ్లు....ఎక్కువ కాలం మ‌న్న‌క‌పోవ‌డం....పాత రోడ్ల‌కు అర‌కొర మ‌ర‌మ్మ‌త‌లు చేసి వ‌దిలేయ‌డం....ఇలా కార‌ణాలేవైనా...వర్షాకాలంలో రోడ్లు త‌టాకాల‌ను త‌ల‌పిస్తాయి. ఈ సారి తెలంగాణ‌లో వ‌ర్ష‌పాతం ఎక్కువ‌గానే న‌మోద‌వడంతో....అక్క‌డి రోడ్లు అధ్వాన్నంగా త‌యార‌య్యాయి. దీంతో, ఈ విష‌యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు....మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని ఓ రైతు న‌డిరోడ్డుపై వ‌రినాట్లు వేశాడు. వినూత్న‌ త‌ర‌హాలో నిర‌స‌న తెలుపుతోన్న‌ ఆ రైతు ఫొటో సోష‌ల్  మీడియాలో వైర‌ల్ అయింది. ఆ రైతుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌రి, ఆ రైతు నిర‌స‌న చూసైనా ప్ర‌భుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News