ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద పెట్రోల్‌ తో హల్‌ చల్‌ చేసిన రైతు..!

Update: 2019-11-19 10:47 GMT
బలవంతుడు బలహీనుడిని బయపెట్టి బ్రతకడం ఆనవాయితీ .. బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడిని పక్కన కూడా ఒక బలం ఉంది ... పెట్రోల్ ఇది అన్ని పనులని చేయిస్తుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రెవెన్యూ ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు పెట్రోల్ చూస్తే జడుసుకుంటున్నారు. ఈ మద్యే  అబ్దుల్లాపూర్ మెట్  తహసీల్దార్ విజయారెడ్డి ని  - ఎమ్మార్వో ఆఫీస్ లోనే పట్టపగలు పెట్రోల్ పోసి - నిప్పు పెట్టారు. దీనితో ఆమె అక్కడిక్కడే ఆమె చనిపోయింది. ఈ ఘటన ని రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులందరూ  ముక్త కంఠం తో ఖండించారు.

ఇక ఈ ఘటన జరిగిన తరువాత చాలామంది ఎమ్మార్వో ఆఫీసుల్లోకి పెట్రోల్ బాటిల్స్ తో వెళ్లడం మొదలుపెట్టారు. ఎన్ని రోజులు తిరిగినా తమ సమస్యలకి పరిష్కారం చూపించడం లేదు అని అధికారులపై దాడులకు దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్‌ లో  జరిగింది. తహశీల్దార్‌ పాస్‌ పుస్తకం ఇవ్వడంలేదన్న కారణంతో ఓ రైతుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తహశీల్దార్‌ కార్యాలయంపై ఏకంగా పెట్రోల్‌ తో దాడికి దిగాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. లంబాడిపల్లికి చెందిన రైతు కనకయ్య తన పొలం పాస్‌ పుస్తకాల కోసం గత కొంతకాలంగా తిరుగుతున్నాడు. కానీ, ఆ పని మాత్రం కావడంలేదు. రేపు, ఈ రోజు అంటూ అధికారులు తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహశీల్దార్‌ ఆఫీస్ కి వచ్చిన కనకయ్య తనతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ తో హల్‌ చల్‌ చేశాడు. పాస్‌ పుస్తకం ఇవ్వడంలేదని ఆఫీసులో ఉన్న అన్ని కంప్యూటర్లపై పెట్రోల్‌ పోశాడు. దీంతో వెంటనే  అక్కడున్న సిబ్బంది ఆయన్ని పట్టుకొని బయటకు తోసేశారు. ఆ తరువాత  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య పెట్రోల్‌ తో రావడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో తహశీల్దార్‌ ఆఫీసు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.


Tags:    

Similar News