చేతిలో డబ్బులు ఉంటేనే సరిపోదు. దాన్ని సరైన పద్దతిలో ఖర్చు చేసే తెలివి ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతుల్లో తోపు రైతులు.. వందల కోట్ల ఆస్తులున్న బడా రైతులకు కొదవ లేదు. అయినప్పటికీ.. వ్యవసాయంలో వస్తున్న వినూత్న విధానాల్ని.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగిస్తూ వ్యవసాయం చేసే విషయంలో ఇప్పటికి వెనుకబడే ఉన్నాం.
పూర్తిగా వెనుకబడిపోయిన రాష్ట్రంగా.. సాంకేతికతను అందిపుచ్చుకోవటంతో తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. ఎక్కడో దూరన ఉన్నట్లుగా చెప్పుకునే రాష్ట్రానికి చెందిన ఒక రైతు చేసిన పని ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
అవును.. డెవలప్ మెంట్ కు సదూరాన ఉండే ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన రాజారాం అనే రైతు మాత్రం రూ.7 కోట్లు ఖర్చు చేసి మరీ ఒక హెలికాఫ్టర్ ను కొనుగోలు చేశారు. నాలుగు సీట్లు ఉన్న ఈ హెలికాఫ్టర్ ను.. పంట మీద పురుగు మందులు చల్లేందుకు వీలుగా.. మార్పులు చేయిస్తున్నారు. త్వరలో రానున్న ఈ హెలికాఫ్టర్ వ్యవహారం ఇప్పుడు అందరి నోటా నానుతోంది.
సంపన్న తెలంగాణ రాష్ట్రానికి కేవలం 300కిమీ దూరంలో ఉండే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాకు చెందిన రాజారాం త్రిపాఠి తన వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా రూ.7 కోట్లు పెట్టి హెలికాఫ్టర్ ను కొనుగోలు చేశారు.
హాలాండ్ కు చెందిన రాబిన్సన్ కంపెనీకి చెందిన ఆర్ 44 మోడల్ హెలికాఫ్టర్ ను ఆయన బుక్ చేసుకున్నారు. పురుగుమందుల పిచికారీతో పాటు.. ఇతర వ్యవసాయ పనులకు అనుగుణంగా ఈ హెలికాఫ్టర్ లో మార్పులు చేయిస్తున్నారు. త్వరలో సదరు రైతు చేతికి రానున్న ఈ హెలికాఫ్టర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఇలాంటి పనే తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఎందుకు చేయటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
తాను ఇంగ్లండ్.. జర్మనీలో పర్యటించిన సందర్భంలో ఎరువుల పిచికారీ కోసం హెలికాఫ్టర్ల వినియోగాన్ని చూశానని.. దీంతో మెరుగైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని తెలుసుకొని హెలికాఫ్టర్ కొనుగోలుకు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. హెలికాఫ్టర్ కొనగానే సరిపోదు.. దీన్ని సరైన రీతిలో నడపాలి. అందుకు సంబంధించిన అనుమతులు తప్పనిసరి కదా? అన్న సందేహం రావొచ్చు. రైతు రాజారాం దాని గురించి ఆలోచించకుండా ఉంటారా?
ఇదే ప్రశ్నకు బదులిచ్చిన రాజారాం.. 'నా కొడుకు.. తమ్ముడ్ని ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీకి పంపా. పైలెట్ శిక్షణ ఇప్పించనున్నా'' అంటూ బదులిచ్చారు. ఇంతలా ఆలోచిస్తున్న ఈ రైతు బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చూసినప్పుడు బోలెడన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. 1998లో తాను చేస్తున్న బ్యాంక్ జాబ్ ను వదిలేసి.. తెల్ల నేలతాడి.. నల్ల మిరియాలను పండించటం షురూ చేశారు.
ఒక హెర్బల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. 400 మంది గిరిజన కుటుంబాలతో కలిసి వెయ్యి ఎకరాల్లో సేంద్రియ ఎరువుల్ని వినియోగించేలా చేయటం ద్వారా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. విదేశాలకు నల్ల మిరియాల్ని ఎగుమతి చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఫ్యాషన్ గా చేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయన్న దానికి రాజారాం ఒక నిలువెత్తు ఉదాహరణగా చెప్పక తప్పదు.