నిజమే... పేరుకే రెడ్డి సామాజిక వర్గం. తరచి చూస్తే మాత్రం పుట్టెడు సమస్యలు కనిపిస్తాయి. ఆర్థికంగా బలమైన కుటుంబాలకు చెందిన రెడ్ల విషయాన్ని పక్కనపెడితే... సాగునే ఆధారం చేసుకుని గ్రామాల్లోనే ఉంటూ అన్నదాతలుగా మారిన రెడ్లు... ప్రత్యేకించి నల్లగొండ జిల్లా కస్తాల గ్రామానికి చెందిన రెడ్ల విషయానికి వస్తే... ఎన్నెన్నో సమస్యలు బయటకు కనిపిస్తాయి. అన్నింటి కంటే పెళ్లీడు వచ్చిన ఈ గ్రామానికి చెందిన రెడ్డి రైతులకు అసలు పిల్లనిచ్చే దిక్కు కూడా కనిపించడం లేదట. సర్కారీ కొలువులో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్యూన్ స్థాయి ఉద్యోగికి అయినా పిల్లనిస్తాం గానీ... పదుల ఎకరాల్లో సాగు చేస్తున్న యువ రైతులకు మాత్రం పిల్లనిచ్చేది లేదని అమ్మాయిల తల్లిదండ్రులు తేల్చేస్తున్నారట. వెరసి సాగు చేయడమే పాపమన్నట్లుగా కప్లాల గ్రామానికి చెందిన యువ రైతులు... పెళ్లీడు దాటిపోతున్నా కూడా బ్రహ్మచారులుగానే కాలం వెళ్లదీస్తున్నారట. ఇక వీరికి అమ్మాయిలను వెతికే పనిలో వీరి తల్లిదండ్రులు కాళ్లరిగేలా తిరుగుతున్నా... ఫలితం కనిపించడం లేదంట. మొత్తంగా ఈ గ్రామంలోని రెడ్డి యువకులకు అసలు పెళ్లిళ్లే కావా? అన్న దిశగానూ ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.
కప్తాల గ్రామానకి చెందిన వివరాల్లోకెళితే.. ఓ మూడు మజరా గ్రామాల కలయికతో ఓ మేజర్ పంచాతీగానే కప్తాల కొనసాగుతోంది. అదే సమయంలో ఊరి జనాభాలో మూడొంతుల మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారట. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు పెళ్లి కుదిరితే... పెళ్లి పీటలెక్కేందుకు 70 మందికి పైగా రెడ్డి యువకులు సిద్ధంగానే ఉన్నారట. అయితే వీరికి చాలా కాలం నుంచి అసలు వధువులే దొరకడం లేదంట. కారణమేమిటంటే... వారంతా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారట. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగమైనా ఫరవా లేదు గానీ.. 40 ఎకరాల మేర భూములున్న రెడ్డి యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న రెడ్డి యువకులకు చూస్తూ చూస్తూ పిల్లనెలా ఇస్తామని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అమ్మాయిల పేరెంట్స్ వాదిస్తున్నారట. దీంతో యుక్త వయసు దాటిపోతున్నా కూడా ఈ రెడ్డి యువకులకు పెళ్లిళ్లే కుదరడం లేదంట.
ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. గ్రామంలో నలుగురు కుమారులున్న ఓ రెడ్డి కుటుంబంలో ముగ్గురు యువకులు హైదరాబాద్ లో ఏవో చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడిన వారికి ఇట్టే పెళ్లిళ్లు కాగా... కుటుంబానికి ఉన్న 40 ఎకరాలను సాగు చేసుకుంటూ ఊరిలో తల్లిదండ్రులను అంటిపెట్టుకుని ఉన్న నాలుగో కుమారుడికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంట. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఏ అమ్మాయి ఇంటికెళ్లినా... సాగు చేస్తున్న పిల్లాడికి పిల్లనెలా ఇస్తామంటూ అమ్మాయిల తల్లిదండ్రులు ముఖం మీదే తలుపులు వేస్తున్నారట. దీంతో ఈ యువకుడితో పాటు ఊరిలోని దాదాపుగా 70కి పైగా రెడ్డి యువకులకు పిల్లలే దొరకడం లేదంట. మరి ఈ పరిస్థితులను దాటుకుని ఈ 70 మంది రెడ్డి రైతులు ఎప్పుడు ఓ ఇంటివారవుతారో చూడాలి.