ఈ సువిశాలమైన ప్రపంచంలో ప్రతి రోజు కూడా రోడ్డు ప్రమాదాల్లో కొన్ని లక్షలమంది మృత్యువాత పడుతుంటారు. మితిమీరిన వేగం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే మనం జాగ్రత్తగా వెళ్తున్నా కూడా ఇతరుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల మరణాల శాతం పరంగా చూసుకుంటే మనదేశంలోనే అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలోని యూపీ రాష్ట్రంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల మరణాలు నమోదవుతున్నాయని గణాంకాలు వివరించారు.
గత సంవత్సర సమయంలో దేశంలో 1.45 లక్షల కొరోనా మహమ్మారి మరణాలు సంభవిస్తే, 1.51 లక్షల రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించాయని లెక్కలు వెల్లడించారు. కరోనా మహమ్మారి కంటే రోడ్డు ప్రమాదాలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఈ లెక్కలు చూసిన తర్వాత అయినా కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాల మరణాలను నివారించడంపైనే దృష్టి పెట్టాలని కోరారు.
తమిళనాడు రాష్ట్రంలో 55శాతం వరకు రోడ్డు ప్రమాదాలను నివారించగలిగినట్టు గడ్కారీ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత చనిపోతున్నారని, హెల్మెట్ వాడకపోవడం వలనే ఇలా జరుగుతున్నట్టు గడ్కారీ తెలిపారు.