ముసలోడా..! నీ కసలు బుద్ధిఉందా?.. కొడుకు ముందే కోడలుకు లిప్​లాక్​..!

Update: 2020-12-11 23:30 GMT
కన్నకొడుకు పెళ్లి వేడుక జరుగుతోంది. బంధువులంతా వచ్చారు. కొడుకు, కోడలును ఆశీర్వదించాల్సన తండ్రి .. కోడలుకు లిప్​లాక్​ ఇచ్చేశాడు. కోడలు వద్దన్నా వినకుండా ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టేశాడు. పెళ్లి వేడుకకు వచ్చిన బంధువులంతా ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్​ అయ్యారు.చైనాలో జరిగిందీ ఘటన. తూర్పు చైనాలో పెళ్లి తూర్పు చైనా జియాంగ్జౌ ప్రావిన్స్‌లో ఇటీవల ఓ యువ జంట వివాహబంధంతో ఒక్కటైంది. అనంతరం అదేరోజు రాత్రి రిసెస్షన్​ జరిగింది.

పెళ్లికి వచ్చిన బంధువులంతా ఫుల్​గా ఎంజాయ్​ చేశారు. చాలామంది మద్యం సేవించారు కూడా. అయితే ఇంతలో మామ తన కోడలని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. చుట్టాలకు ఆమెను పరిచయం చేస్తున్నాడు. కోడలును కూడా కన్నకూతురులాగే చూసుకుంటున్నాడని అంతా మురిసిపోయారు. కానీ ఆ వృద్ధుడికి ఇంతలోనే ఏమైందో తెలియదు. సడెన్​గా కోడలిని దగ్గరుకు తీసుకొని ఆమె పెదవులను ముద్దాడాడు. ఈ ఘటనతో బంధువులంతా ఒక్కసారిగా షాక్​ అయ్యారు.

మామ అలా ప్రవర్తించడంపై అక్కడున్న వాళ్లంతా అభ్యంతరం చెప్పారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు ఇక వధువు తల్లిదండ్రులకు చిర్రెత్తుకు వచ్చింది. తమ వియ్యంకుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఒరేయ్ ముసలోడా.. నీకసలు బుద్ధి ఉందా.. కోడలితో అలాగేనా ప్రవర్తించేది.. అంటూ మండిపడ్డారు. కొడుకు రిసెప్షన్​లో కన్నతండ్రే ఇలా ప్రవర్తిండంతో చుట్టాలంతా షాక్​ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. ఎంత తాగి ఉంటే మాత్రం కొడుకు పెళ్లాన్ని ముద్దు పెట్టుకోవడం ఏమిటని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.
Tags:    

Similar News