సమాజంలో రోజురోజుకి బంధాలకి - బంధుత్వాలకి విలువలు లేకుండా పోతున్నాయి. కామంతో కోళ్ళుమూసుకుపోయిన కొందరు కామాంధులు వావివరసలు మరచి - సొంత వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతూన్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా కన్నకూతురిలా చూసుకోవలసిన కోడలి పై మామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ దుర్ఘటన . విజయనగరం జిల్లాలో జరిగింది.
పూర్తి వివరాలు చూస్తే ... పాత బొబ్బిలి ప్రసాద్ నగర్ కాలనీలో యువకుడికి కొంతకాలం క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ వేరు కాపురం ఉంటున్నారు. యువకుడికి చిన్నాన్న అయ్యే వ్యక్తి తరుచూ వారింటికి వచ్చి - మాట్లాడి వెళ్ళేవాడు. చిన్న మామగారే కదా అని ఆమె కూడా అతడితో చనువుగా మాట్లాడేది. ఈ క్రమంలోనే కోడలి పై కన్నేసిన ఆ కీచక మామ. ఇంట్లో ఆమె భర్త లేని సమయం చూసి ఒకసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే , ఆ విషయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక - అలాగే సైలెంట్ గా ఉన్నది. అదే అదునుగా చేసుకొని ,పలుమార్లు కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇదే క్రమంలోనే .. ఆదివారం ఆమె భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండగా - ఆ విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను తాళ్లతో కట్టి కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. కాసేపటికి తేరుకున్న బాధితురాలు ఎదురింటి వారికి తన గోడును చెప్పుకుంది. దీంతో బాధితురాలిని ఓదార్చిన సాటి మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. చిన్నమామ గతంలోనూ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, చంపేస్తానని బెదిరించడంతో ఆ విషయం ఎవరికీ చెప్పలేదని బాధితురాలు పోలీసులకి చెప్పింది. అయితే ఇదంతా తెలుసుకున్న ఆ మామ పరారయ్యాడు. అయితే , పోలీసులు మాత్రం వదల్లేదు. ఆ కామాంధుడిని పట్టుకొని రిమాండ్ కు తరలించారు.