యుద్ధం ఆపాలంటే అభినందన్ ని విడిచిపెట్టండి

Update: 2019-02-28 07:17 GMT
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్  అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెల్సిందే. ఆయన క్షేమంగా తిరిగి రావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. అభినందన్ కి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ దేనని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. జేనీవా నియమావళిని ఉల్లంఘిస్తే తీవ్ర పరిస్థితులు తప్పవని భారత్ హెచ్చరించింది.

పాకిస్తానీ పౌరులు కూడా భారత్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు. భారత్ ఏనాడూ పాకిస్తానీ పౌరులపై దాడులు చేయలేదని కేవలం ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తూ వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీకి చిక్కిన అభినందన్ ని క్షేమంగా ఇండియాకు పంపించాలని పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనునరాలు - పాకిస్తానీ ప్రముఖ రచయిత్రి ఫాతిమా భూట్టో ప్రస్తుత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే విక్రమ్ అభినందన్ ను క్రూరంగా హింసించిన వీడియోలు బహిర్గతం కావడంతో యావత్ భారత్ తో పాటు - పాకిస్తానీ పౌరులు కూడా దీనిపై  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పాకిస్తాన్  నిజంగా శాంతిని కోరుకుంటే భారత్ పైలట్ ను ఆ దేశానికి అప్పగించాలని.. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించాలని ఫాతిమా భుట్టో డిమాండ్ చేశారు. తమ దేశం ఎప్పుడూ పోరుగుదేశంతో శాంతియుతంగా మెలగడం తాను చూసింది లేదంటూ న్యూయార్క్ టైమ్స్ కు రాసిన వ్యాసంలో ఆమె వెల్లడించారు. తాము ఎల్లప్పుడూ పాకిస్తానీయుల నిరసన గళం వినిపించడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదం - సైనిక పాలన - మతదురాభిమానాకి తామంతా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తొలిగిపోవాలని కోరుకుంటున్న పేర్కొన్నారు.

ఓ వైపు సరిహద్దుల్లో బాంబులతో దాడులు చేస్తూ - మరోవైపు శాంతి చర్చలంటూ రెండు నాల్కల ధోరణిని పాక్ అవలంభిస్తోందని ఫాతిమా భుట్టో విమర్శించారు.  రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలంటే పాకిస్తాన్ భారత పైలెట్ అభినందన్ ను భారత్ కి అప్పగించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆమె స్పష్టం చేిసంది.
Tags:    

Similar News