ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి. బలమైన జట్లు మట్టి కరిచి అనామక జట్లు సత్తా చాటుతున్నాయి. ఇటీవల వరల్డ్ నంబర్ 1 బ్రెజిల్ జట్టు క్రొయేషియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. బ్రెజిల్ ను ఓడించి గత వరల్డ్ కప్ రన్నరప్ అయిన క్రొయేషియా సెమీస్ చేరింది. ఇక నిన్న జరిగిన మ్యాచులతో సెమీస్ రేసు తేలిపోయింది.
ఫిఫా వరల్డ్ కప్ లో 2018లో కప్ కొట్టిన డిఫెడింగ్ చాంపియన్ ఫ్రాన్స్ మరోసారి సత్తా చాటింది. క్వార్టర్ ఫైనల్ లో ఇంగ్లండ్ ను ఓడించి సెమీస్ కు చేరింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ లో 2-1 తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. ఇరుజట్లు విజయం కోసం అద్భుతంగా పోరాడాయి. కానీ ఫ్రాన్స్ ను విజయం వరించింది. ఇంగ్లండ్ జట్టే బంతిని తన నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ గోల్స్ కొట్టడంలో విఫలమైంది. ఈ విజయంతో ఫ్రాన్స్ సెమీస్ లో ఆఫ్రికా జట్టు మొరాకోను ఢీకొట్టనుంది. ఇక క్వార్టర్స్ లో బలమైన రోనాల్డో జట్టు పోర్చుగల్ ను ఓడించిన మొరాకో తొలిసారిగా సెమీస్ కు చేరి సంచలనం సృష్టించింది. ఫ్రాన్స్ తో పోలిస్తే మొరాకో చిన్న జట్టే అయినా తక్కువ అంచనావేయడానికి లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఫైనల్ చేరే అవకాశాలు ఫ్రాన్స్ కు బలంగా ఉన్నాయి. మొరాకోను ఓడిస్తుందా? లేక మరో సంచలనం నమోదవుతుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం ఫ్రాన్స్ ఫాం చూస్తే ఫైనల్ చేరడం గ్యారెంటీ అంటున్నారు.
ఇక నిన్న జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ లో నెదర్లాండ్ ను ఓడించిన అర్జెంటీనా అతి కష్టం మీద సెమీస్ చేరింది. మొదట స్కోర్లు 2-2తో సమం అయ్యాయి. నెదర్లాండ్ కూడా షాకిచ్చేలా తయారైంది. స్కోర్లు సమం అయ్యి పెనాల్టీ షూటౌట్ వరకూ వెళ్లింది. పెనాల్టీలలో అర్జెంటీనా 4-3 తేడాతో గోల్ కీపర్ దయవల్ల చచ్చీ చెడీ సెమీస్ చేరింది.
మొన్నటి మరో క్వార్టర్ ఫైనల్ లో బ్రెజిల్ ను ఓడించిన గత వరల్డ్ కప్ రన్నరప్ క్రొయేషియా సంచలనం సృష్టించింది. మొదట స్కోర్లు 1-1తో సమం కాగా.. పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. ఇందులో 4-2 తేడాతో బెజ్రిల్ ను ఓడించి సంచలనం సృష్టించింది క్రోయేషియా. నంబర్ 1 జట్టు బ్రెజిల్ శోకసంద్రంలో మునిగింది. ఆటగాళ్లు, అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. బ్రెజిల్ కీలక ప్లేయర్ నెయ్ మర్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
అస్సలు ఎవరూ ఊహించకుండా ఆఫ్రికా ఖండం నుంచి తొలిసారి ఒక జట్టు మొరాకో సెమీస్ చేరడం సంచలనమైంది. పోర్చుగల్ పై విజయంతో ఇది సాధ్యమైంది. దీంతో సెమీస్ సమీకరణాలు పూర్తిగా మారాయి. చిన్న జట్లు అయిన మొరాకో, క్రోయేషియాలు పెద్ద జట్లు అయిన బ్రెజిల్, పోర్చుగల్ కు షాకివ్వడం ఈ ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనాలకు దారితీసింది. ఇక గత ప్రపంచకప్ విన్నర్ ఫ్రాన్స్ అంచనాలకు అనుగుణంగా ఆడుతూ సెమీస్ చేరింది. ఒక్క మ్యాచ్ కూడా ఈ జట్టు ఓడిపోలేదు.
ఇప్పుడు సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. అర్జెంటీనా వర్సెస్ క్రోయేషియా తలపడబోతోంది. ఇక మరో సెమీస్ లో బలమైన ఫ్రాన్స్ మొరాకోతో తలపడబోతోంది. బలబలాలు చూస్తే మరోసారి 2018 వరల్డ్ కప్ రిపీట్ అయ్యేలా ఉంది. ఫ్రాన్స్, క్రోయేషియా ఫైనల్ జరగవచ్చని అంటున్నారు. లేదంటే ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా కూడా ఫైనల్ లో తలపడవచ్చని ఈ రెండు భీకర జట్లు ఫైనల్ చేరితే చూసేందుకు పండుగనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.