యూపీలో పోటీ రెండు పార్టీల మధ్యేనా ?

Update: 2022-01-09 07:30 GMT
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. అవటానికి ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లోనే అయినా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం రెండు రాష్ట్రాలే. అవి పంజాబ్, ఉత్తరప్రదేశ్. మిగిలిన మూడు చిన్న రాష్ట్రాలు గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ పై జనాల్లో పెద్దగా దృష్టి కనిపించటంలేదు. రెండు పెద్ద రాష్ట్రాల్లో కూడా పంజాబ్ మీదకన్నా యూపీ మీదే అందరి దృష్టి కేంద్రీకృతమయ్యుంది. దీనికి ప్రదాన కారణం ఏమిటంటే యూపీ ఎన్నికల ఫలితాలే 2024 జనరల్ ఎలక్షన్ కు గేట్ వే అని చాలామంది అనుకుంటున్నారు కాబట్టే.

ఇప్పటికైతే యూపీలో బీజేపీదే అధికారమని ప్రీపోల్ సర్వేలు చెప్పాయి. అయితే బీజేపీ బలం చాలా గణనీయంగా తగ్గిపోతుందని సర్వేల్లో స్పష్టమవుతోంది. ఇపుడు బీజేపీ కూటమికి 312 ఎంఎల్ఏల బలముంది. ఈ బలం రాబోయే ఎన్నికల్లో 240కి పడిపోతుందని ప్రీపోల్ సర్వేల్లో బయటపడింది. అంటే ఒక్కసారిగా బీజేపీ కూటమి బలంలో 72 సీట్లకు కోతపడబోతోందనే విషయం అర్ధమైంది. ఇక్కడే అందరిలోను టెన్షన్ మొదలైంది. ఆ కోత 72 సీట్లతో ఆగుతుందా లేకపోతే ఇంకా ఎక్కువపడుతుందా అన్నదే అర్ధం కావటంలేదు.

నరేంద్రమోడీ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్ పాలనపైన కూడా వ్యతిరేకతుంది. అయితే ఆ వ్యతరేకతను ప్రతిపక్షాలు ఎంతవరకు అడ్వాంటేజ్ తీసుకుంటాయన్నదే ప్రశ్న.  ఇక్కడే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. యూపీలోని వివిధ ప్రాంతాల్లో గట్టిపట్టున్న ఆర్ఎల్డీ లాంటి చిన్న పార్టీలతో వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకున్నారు. ఎస్పీ పొత్తుల్లో ఆప్ కూడా కీలకమైందే. కాకపోతే ఆప్ బలం ఎంతన్నదే అర్ధం కావటంలేదు. ఎస్పీ బలం బాగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి.

పెద్ద పార్టీలుగా చెలామణిలో ఉన్న బీఎస్పీ బలం పూర్తిగా క్షీణించిపోయిందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్ పరిస్దితిలో ఎలాంటి మార్పులేదట. ప్రియాంకా గాంధి ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదని సర్వేలు తేల్చేశాయి. సో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో పోటీ బీజేపీ కూటమి-ఎస్పీ కూటమి మద్యే జరుగుతుందని అర్దమైపోతోంది.

వ్యవసాయ చట్టాలు, తర్వాత రద్దు, ఆ తర్వాత లఖింపూర్ ఖేరిలో రైతుల మరణాలు లాంటి వాటితో బీజేపీపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. అయితే ఈ వ్యతిరేకత జాట్లు ఎక్కువగా ఉండే పశ్చిమ యూపికే పరిమితమా లేకపోతే రాష్ట్రమంతా ఉంటుందా అనేది చాలా కీలకంగా మారింది. ఒకవేళ రైతు ఉద్యమం, రైతుల మరణాల ప్రభావం రాష్ట్రమంతా ఉంటేగనుక బీజేపీకి ఇబ్బందనే చెప్పాలి. ఇక పంజాబ్ లో అయితే సింగిల్ లార్జెస్టు పార్టీగా ఆప్ అధికారంలోకి రావటం కాయమని అన్నీ సర్వేల్లో ఇప్పటికే తేలింది. కాబట్టే అందరి దృష్టి యూపీ పైనే ఉంది.
Tags:    

Similar News