రాజకీయం ..ఇదొక మాయ ప్రపంచం. ఈ రాజకీయాలలో పదవి ఉన్నత కాలం ఎంత రాజభోగం ఉంటుందో .. పదవి పోయిన తరువాత అంతకంటే ఎక్కువ దరిద్రంగా ఉంటుంది. అందుకే ఒకసారి పదవికి అలవాటు పడిన ఏ రాజకీయ నాయకుడైన కూడా ఎదో ఒక పదవి కోసం రాజకీయం నడిపిస్తూనే ఉంటారు. రాజకీయాలలో ఉన్న ఆ పదవి కాంక్షే వేరు అని చెప్పాలి. ఇక ఒకే సామజిక వర్గంకి చెందిన వారు ఒకే పార్టీలో ఉంటె ఆ రాజకీయ పోరు మరో లెవల్ లో ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వారు అంతా కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ - ఒక్కసారి వారిలో చీలికలు వస్తే మాత్రం అదొక పెద్ద సమస్యగా మారిపోతుంది. ముఖ్యంగా ఒకే సామజిక వర్గం కావడంతో పార్టీ సామాజికవర్గం పరంగా ఇచ్చే పదవుల విషయంలో వీరి మధ్య అంతర్గత యుద్ధం జరిగే అవకాశం ఉంది. అలాంటిదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలలో ఆ వర్గం నుండి నలుగురు కీలక నేతలు ఉన్నప్పటి ..ఇప్పుడు కేవలం క్రియాశీలకంగా ఒక్కరే కీలక పదవిలో కొనసాగుతున్నారు. దీనితో ఆ ఒక్కరే మిగతా ముగ్గురిని తొక్కేశారని .. తన వర్గం నుండి అయన ఒక్కడే చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తునట్టు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఈ నలుగురు ఎవరు ..ఆ నలుగురిలో ఆ ఒక్కరు ఎవరు?
స్వామిగౌడ్.. తెలంగాణ ఏర్పడక ముందు టిఎన్జీవోల నాయకుడు. తర్వాత శాసన మండలి తొలి ఛైర్మన్. శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ ఏర్పడక ముందు టిజివో నేత…ఏర్పడిన తర్వాత తొలుత ప్రభుత్వ విప్. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి. పద్మారావు గౌడ్.. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఎమ్మెల్యే. ఆ తర్వాత కెసీఆర్ తొలి మంత్రి వర్గంలో మంత్రి కూడా. ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్. బూర నర్సయ్య గౌడ్.. తెలంగాణ ఏర్పాటు కాక ముందు తెలంగాణ వైద్యుల జెఎసీ నేత.. ఏర్పాటయ్యాక ఒక టర్మ్ లోక్ సభ సభ్యుడు.ఒకప్పుడు పలు కారణాల వల్ల అంతా ఒక్కటిగా కనిపించిన ఈ నలుగురు నేతలు ఇప్పుడు ఎవరి దారిలో వారు కొనసాగుతున్నారు. ఈ నలుగురు నాయకుల్లో శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కేబినెట్ లో ఉండగా.. పద్మారావుగౌడ్ ఉపసభాపతిగా శాసనసభలో ఉన్నారు. మరో ఇద్దరు స్వామిగౌడ్ - బూర నర్సయ్యగౌడ్ మాత్రం పదవులు లేక సైలెంట్ అయ్యారు. పద్మారావు గౌడ్ కు పదవి వున్నా పొలిటికల్ గా ఈ ముగ్గురు నాయకులు యాక్టివ్‌గా లేరు. దీంతో ఇదే అడ్వాంటేజ్ గా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందుకు వెళుతున్నారట.
ఇకపోతే గతంలో గౌడ సామాజిక వర్గం నుండి అయిన - ఉద్యోగుల సంఘాల నుండి అయిన శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కీలకంగా వ్యవహరించేవారు. అయితే స్వామి గౌడ్ పదవి కాలం పూర్తి కావడం..తిరిగి ఆయనకు గులాబీ బాస్ ఎలాంటి పదవి కట్టబెట్టకపోవడం తో కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఇక రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యారు. దీంతో తన సొంత సామాజిక వర్గం లో పట్టు సాధించారు. మిగతా నేతలు తనకు పోటీకి రాకుండా స్కెచ్‌లు వేస్తున్నారని కొందరు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్వామి గౌడ్ పదవి కాలం ముగిసి రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి పదవీ రాలేదని చర్చ జరుగుతోంది.
అటు పద్మారావు గౌడ్ మొదటి నుండి టిఆర్ ఎస్ లో ఉన్నారు. తెలంగాణ తొలి కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కానీ రెండో మంత్రివర్గంలో చోటు దక్కలేదు. రెండవ సారి గెలిచిన తర్వాత ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దీంతో అసంతృప్తితో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. అటు భువనగిరి ఎంపీ ఎన్నికల్లో రెండవ సారి ఒడిపోవడంతో పాటు ఎలాంటి పదవి లేక బూర నర్సయ్య గౌడ్ కూడా పెద్దగా యాక్టివ్‌గా లేరు. దీనితో ప్రస్తుతం ఆ సామజిక వర్గం మొత్తం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టే తిరుగుతుంది. అయితే ఈ ముగ్గురు నేతలతో గ్యాప్ విషయం తెలిసిన శ్రీనివాస్ గౌడ్ వారిని కూల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిని కలిసిన శ్రీనివాస్ గౌడ్ ..త్వరలో ఆ ఇద్దరిని కలిసి ..అందరిని కలుపుపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.