వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి వారు సూచిస్తున్నది ఒకటే ఒకటి. కడుపునిండా తిని ఆరోగ్యంగా ఉండండి అని చెబుతున్నారు. అలా ఎందుకు చెబుతున్నారంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం. రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే వైరస్ వ్యాపించదు. అయితే క్రమంగా బరువు తక్కువగా ఉంటే మాత్రం వైరస్ ముప్పు పొంచి ఉన్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బరువు తక్కువగా ఉంటే శరీరం వైరస్‌లతో పోరాడలేదు. తరచూ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మీ బరువు ఎంత ఉంది? గతానికన్నా అధికంగా ఉంటే మంచిదే. కాకపోతే తగ్గుతుంటే వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే మహమ్మారి వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఓ అధ్యయనం అధ్యయనం హెచ్చరిస్తోంది. అయితే అధిక బరువు ఉంటే కూడా చాలా ప్రమాదం అని కూడా చెబుతోంది. అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే వైరస్ సోకితే చనిపోయే దాకా పరిస్థితులు వస్తాయని తెలిపింది.
ఊబకాయం ఉన్నవారిలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటాయని గతంలో ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అధిక బరువు ఉన్నవారిలో డయాబెటిస్, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దీంతో వైరస్ బారిన పడితే వాటికి తోడు ఈ వ్యాధులు తోడై ప్రాణాపాయం సంభవించే ప్రమాదం కూడా ఉంది. ఊబకాయంతో బాధపడేవారంతా తొందరగా వ్యాధుల బారినపడుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం మహమ్మారి వైరస్ బారిన కూడా పడే అవకాశం అధికంగా ఉంది. దీనిపై పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) పరిశోధనలు చేసి ఓ అధ్యయనాన్ని నివేదికగా విడుదల చేసింది. వాటిలో పై విషయాలన్ని పేర్కొన్నారు.
అ అధ్యయనం ప్రకారం.. 30-35 బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఉన్నవారికి వైరస్ నుంచి మరణించే ప్రమాదం 40శాతం పెరుగుతుందని హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన బరువు ఉన్న వారితో పోలిస్తే 40 కంటే ఎక్కువ బీఎంఐ ఉన్నవారికి 90 శాతం పెరుగుతుందని పేర్కొంది. 30 కంటే ఎక్కువ బీఎంఐ ఉన్నవారిని ఊబకాయంగా చెబుతారు. అధిక బరువు లేదా ఊబకాయం ఉండడంతో వైరస్ ముప్పు నుంచి తప్పించుకోలేరు. ఇతర వ్యాధుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఊబకాయం ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా సోకుతాయి.
అలాంటి వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి, స్థూలకాయం ఇన్ఫ్లుఎంజా వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో ప్రస్తుత వైరస్ తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. అధిక శరీర బరువు కొవ్వు డయాఫ్రాగమ్‌పై ఒత్తిడి తెస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అందుకే మరణాలు అధికంగా సంభవించే ప్రమాదం ఉంది. ఊబకాయం.. అధిక బరువుతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.