రాష్ట్రంలో మాస్కు లేకుండా రోడ్డెక్కితే ఫైన్ 18 వేల మంది నుంచి వ‌సూలు!

Update: 2021-03-30 01:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎంత‌గా విజ్ఞ‌ప్తి చేసినా.. నిబంధనలు పాటించడంలో చాలా మంది  మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. సర్కారు సీరియస్ గా తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఎవ‌రు రూల్స్ అతిక్ర‌మించినా భారీగా ఫైన్ విధిస్తున్నారు పోలీసులు.

ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ పోలీసుల‌కు కీల‌క ఆదేశాలు జారీచేశారు. ఎవ‌రు నిబంద‌న‌లు అతిక్ర‌మించినా.. ఉపేక్షించే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పారు. మాస్కులు లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే భారీగా ఫైన్ విధించాల‌ని ఆదేశించారు. డీజీపీ ఆదేశాల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

మాస్కుల్లేకుండా తిరుగుతూ ఎవ‌రు క‌నిపించినా.. ముక్కు మూసుకొని ఫైన్ క‌ట్ట‌మంటున్నారు. ఈ ఫైన్‌ క‌నీసం రూ.250గా ఉంది. జ‌నాలు నిబంధ‌న‌లు ఉల్లంఘించే తీరును బ‌ట్టి ఈ మొత్తం పెరుగుతోంద‌ని స‌మాచారం. రోడ్ల‌మీద మాటు వేస్తున్న పోలీసులు.. మాస్కు లేకుండా ఎవ‌రు క‌నిపించినా వ‌దల‌ట్లేదు.

ఈ విధంగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 18,566 మందికి ఫైన్ విధించిన‌ట్టు స‌మాచారం. వారి నుంచి ఒక్క రోజులోనే 17.34 ల‌క్ష‌ల అప‌రాధ రుసుము వ‌సూలు చేసిన‌ట్టు స‌మాచారం. మాస్కు లేకుండా ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఫైన్ చెల్లించాల్సిందేన‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించి, వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవాల‌ని సూచిస్తున్నారు.
Tags:    

Similar News