భారత్ కు చుక్కలు చూపించిన ఇండోనేసియా

Update: 2015-11-12 05:40 GMT
దశాబ్దాల తరబడి వెతుకుతన్న అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇండోనేసియాలో పట్టుబట్టటం.. అనంతరం భారత్ అధికారులు జోక్యం చేసుకొని..ప్రత్యేక విమానంలో ఛోటాను భారత్ కు తీసుకురావటం తెలిసిందే. పైకి సింఫుల్ గా కనిపించిన ఈ వ్యవహారం వెనుక చాలానే కథ నడిచిందని చెబుతున్నారు. ఛోటాను అదుపులోకి తీసుకున్న వెంటనే.. అతడ్ని భారత్ కు తీసుకురావటానికి భారత అధికారులు ప్రయత్నాలు షురూ చేశారు. అయితే.. ఛోటాను భారత్ కు అప్పగించే విషయంలో ఇండోనేసియా అధికారులు చుక్కలు చూపించారట.

ఛోటా మీద పలుకేసులు భారత్ లో నమోదై ఉన్నాయని.. అతడ్ని తమకు అప్పగించాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ ప్రయత్నిస్తే..వారికి షాక్ తగిలేనా.. తమ దగ్గర ఉన్న ఛోటాకు.. భారత్ చెప్పే ఛోటాకు అస్సలు సంబంధం ఉందా? అన్న ప్రశ్నతో పాటు.. తమ కస్టడీలో ఉన్న ఛోటానే భారత్ అడుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని ఎలా చెబుతారని ప్రశ్నించారట.

దీంతో.. ఏం సమాధానం చెప్పాలో తోచక భారత అధికారులు కిందామీదా పడుతున్న సమయంలో ముంబయి పోలీసులు.. ఈ విషయంలో ఆదుకున్నారని చెబుతున్నారు. ఎందుకంటే.. రాజన్ చోటామోటా నేరాలు చేస్తున్న సమయంలో అతగాడ్ని అదుపులోకి తీసుకున్న నాటి ముంబయి పోలీసులు.. అతగాడి వేలిముద్రలు తీసుకున్నారు. తాజా ఇష్యూలో ఇండోనేసియా అధికారులు అడిగినట్లుగా అతగాడి వేలిముద్రలు ఇవ్వటం.. అవి సరిపోవటంతో.. ఛోటాను భారత్ కు అప్పగించేందుకు ఇండోనేషియా అధికారులు ఓకే చేశారట. అప్పుడెప్పుడో పాతికేళ్ల కిందట కానీ ముంబయి పోలీసులు ముందుచూపుతో ఛోటా రాజన్ వేలిముద్రలు సేకరించి ఉండకపోతే.. ఈరోజు అతగాడ్ని భారత్ కు తీసుకురావటం కష్టంగా మారేదని చెబుతున్నారు.
Tags:    

Similar News