ప్రగతి భవన్ ముట్టడి కేసులో సీఎం మనవడు !

Update: 2020-08-13 10:50 GMT
బుధవారం ప్రగతిభవన్ ను ముట్టడి చేసిన విషయం తెలిసిందే. పీపీఈ కిట్లు ధరించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు  ప్రగతి భవన్ ముట్టడించిన కేసులు మరో కీలక అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడించిన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు రితేష్ కూడా ఉన్నారు. నిన్న మొత్తం ప్రగతి భవన్ ని ముట్టడించిన 20 మంది నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కార్యకర్తల మీద కేసులు పెట్టగా దానికి సంబందించిన ఎఫ్ ఐ ఆర్ లో ఏ5గా రితేష్ ఉన్నాడు. ప్రస్తుతానికి వీరందరినీ రిమాండ్ కు తరలించారు. ఇకపోతే , ఈ రితేష్ కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న రమ్యరావు కుమారుడు. దీంతో ప్రభుత్వం మీద రితేష్ తల్లి రమ్యరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో  పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్ ‌ఎస్‌ యూఐ నాయకులు ప్రగతి భవన్ ‌ను ముట్టడించడంతో అక్కడ పరిస్థితులు కొంచెం అదుపు తప్పాయి. బుధవారం ఉదయం పీపీఈ కిట్లు ధరించి ఓ డీసీఎంలో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు, ఒక్క సారిగా ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓ విద్యార్థి ఇనుప గ్రిల్స్‌ ఎక్కి లోపలకు దిగాడు. దీనితో ,  అప్రమత్తమైన పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వారందరు అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తూ , నిరసన తెలపడతో పోలీసులు వారిని గోషామహల్‌ స్టేషన్ కి తరలించారు.
Tags:    

Similar News