హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న శివపార్వతి థియేటర్ లో తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. థియేటర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే థియేటర్ బుగ్గి అయ్యింది..
ఈ ఘెర అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఆస్తినష్టం మాత్రం భారీగా సంభవించింది. కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చని అభిప్రాయాలున్నాయి.
దీనిపై స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు విచారణకు ఆదేశించారు. మంటలు చెలరేగిన సమయంలో థియేటర్ లో ఎవరూ లేరు.. ఫలితంగా ప్రాణాపాయం తప్పింది. సినిమా ప్రదర్శించే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం వాటిల్లేది. ప్రస్తుతం శివపార్వతి థియేటర్ లో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ప్రదర్శితమవుతోంది.
తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి మొత్తం వ్యాపించాయి. ఎవరూ గమనించకపోవడంతో థియేటర్ మొత్తం కాలి బూడిదైంది. కోట్ల రూపాయల ఆస్తినషఊ్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.