అమెరికాలో తొలి ఫలితం.. హిల్లరీ విజయం!

Update: 2016-11-08 09:08 GMT
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ఈ తొలి ఫలితంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ విజయం సాధించారు. న్యూ హాంప్ షైర్ లోని డిక్స్ విల్లె నాచ్ లో పోలింగ్‌ పూర్తయి ఈ ఫలితం వచ్చింది. ఈ ప్రాంతంలో హిల్లరీ 4-2 తేడాతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ను ఓడించారు. దీంతో 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ తొలి గెలుపు నమోదు చేసుకున్నట్లయ్యింది. ఇక్కడ ఎనిమిది ఓట్లు నమోదు కాగా వాటిలో నాలుగు హిల్లరీకి, రెండు ట్రంప్‌ కు, స్వతంత్రులు గేరీ జాన్సన్‌, మిట్టీ రోమ్నీ చెరొక ఓటును దక్కాయి.

భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం అమెరికా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కౌంటింగ్ చేపడతారు. రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి ఓటింగ్ జరిగిన డిక్స్ విల్లె నాచ్ ఫలితం వెలువడింది. ఇక్కడి నుంచి హిల్లరీ గెలవడంతో డెమొక్రటిక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆమెకు 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని తుది, తాజా రాయిటర్స్ సర్వేలో వెల్లడైంది.

కెనడా సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరిలో అర్థరాత్రే పోలింగ్‌ మొదలవడంతో, 24 గంటల ముందుగానే తొలి ఫలితం వెలువడుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోలింగ్‌ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. టైమ్‌ జోన్లు వేర్వేరుగా ఉండడం వల్ల ఒక చోట ఫలితాలు వెలువడుతున్న సమయానికి మరో రాష్ట్రంలో పోలింగ్‌ కొనసాగుతూనే ఉంటుంది. కాగా అమెరికా ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారని దాదాపు అన్ని సర్వేలు ఇంతకాలం చెప్పగా... ఆమె గెలిచే అవకాశాలు 90 శాతం ఉన్నాయని తుది, తాజా సర్వేలో వెల్లడైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News